సందీప్ కిషన్ తో ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న భారీ చిత్రం మైకేల్. పైగా పలు భాషల నటులను తీసుకుని పాన్ ఇండియాగా తయారు చేస్తున్న చిత్రం ఇది.
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్వాంశ కౌశిక్, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇలా చాలా భారీ తారాగణం వుందీ చిత్రంలో. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం, విడుదల జరుపుకుంటున్న ఈ సినిమాకు దర్శకుడు రంజిత్ జయ్ కోడి. నిర్మాతలు ఆసియన్ సునీల్, భరత్ చౌదరి, రామ్మోహనరావు.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ గా తయారవుతున్న ఈ సినిమాను డిసెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ తరువాత నుంచి పండగ వరకు సినిమాలు లేవు. ఈ టైమ్ లో అయితే బాగుంటుందనే ఆలోచనతో 30న విడుదల టార్గెట్ గా సినిమాను రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్రిశాట్ ఏరియాలో పలు ఔట్ డోర్ సీన్లు చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాలో దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ నెగిటివ్ షేడ్ వున్న పాత్ర పోషిస్తుండడం విశేషం. వరలక్ష్మీ శరత్ కుమార్, విజయ్ సేతుపతి వి కీలకపాత్రలు. శామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.