బివిఎస్ రవికి చాన్స్ ఇస్తున్న మెగాస్టార్

భోళా శంకర్ తరువాత మెగాస్టార్ చేయబోయే సినిమా ఇప్పటి వరకు ఫిక్స్ కాలేదు. కథలు వింటున్నారు. నిర్మాతలు రెడీగా వున్నారు. కానీ దర్శకుడు ఎవరు అన్నదే సమస్య.  Advertisement వివి వినాయక్ తో చేయడానికి…

భోళా శంకర్ తరువాత మెగాస్టార్ చేయబోయే సినిమా ఇప్పటి వరకు ఫిక్స్ కాలేదు. కథలు వింటున్నారు. నిర్మాతలు రెడీగా వున్నారు. కానీ దర్శకుడు ఎవరు అన్నదే సమస్య. 

వివి వినాయక్ తో చేయడానికి మెగాస్టార్ రెడీ కానీ కథ కావాలి. ఆయన దగ్గర కథలు లేవు. వాటి కోసం అన్వేషిస్తున్నారు. గోపీచంద్ మలినేని ఇంట్రస్ట్ గా వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి కానీ మెగాస్టార్ వైపు నుంచి సరైన సమాచారం లేదు. ఇలాంటి నేపథ్యంలో రచయిత బివిఎస్ రవి ఓ లైన్ ను మెగాస్టార్ కు చెప్పారు. అది ఓకె అయింది. అయితే మళ్లీ ఇక్కడా అదే సమస్య దర్శకుడు ఎవరు?

బివిఎస్ రవి చెప్పిన కథను తన కూతురు నిర్మాతగా నిర్మించాలని మెగాస్టార్ డిసైడ్ అయ్యారు. అది వాస్తవం. కానీ దర్శకుడు ఎవరు అన్నదే పాయింట్. బివిఎస్ రవి స్వతహాగా దర్శకుడే కానీ, కథ..మాటలు మాత్రమే ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల దర్ళకుడు ఎవరో తేలితే మెగాస్టార్ తరువాత సినిమా తన కూతురు బ్యానర్ లోనే వుంటుంది.

ఇదిగాక మరో రెండు సంస్థలతో కూడా మెగాస్టార్ సంప్రదింపులతో వున్నారు. కానీ వాళ్లకీ ఇదే సమస్య. డైరక్టర్ కావాలి. పెద్దగా టాప్ డైరక్టర్ లు అక్కరలేదు. ఒకటి రెండు హిట్ లు అప్పుడో, ఎప్పుడో ఖాతాలో వున్నవారైనా చాలు. మిగిలినదంతా మెగాస్టార్ చూసుకుంటారు.