కొన్ని క్యారెక్టర్ల పేరు వింటే చాలు నవ్వు దానంతట అదే పలుకుతుంది. రీల్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ నవ్వులు పూయించే నటులు మనకున్నారు. అలాంటి వారిలో బండ్ల గణేష్ ప్రముఖుడు. బండ్ల మాటలు, చేష్టలు భలే కామెడీ పండిస్తాయి. అందుకే బండ్ల గణేష్ సినిమాలతో సంబంధం లేకుండానే మనకు గుర్తుంటాడు.
అలాంటి బండ్ల గణేష్ ఇక తాను కామెడీ పండించనని చెప్పకనే చెబుతున్నాడు. తాజాగా సగం తెలుగు, సగం ఇంగ్లీష్‌లో ఆయన చేసిన ట్వీట్‌లో ఈ విషయాన్ని తేల్చి చెప్పాడు. త్వరలో ట్విటర్‌కు గుడ్ బై చెబుతానని ఆయన ప్రకటించడం హాస్యప్రియులకి చేదు వార్తే. ఇంతకూ ఆయన ఏమన్నారో యథాతధంగా…
‘త్వరలో ట్విట్టర్ కి గుడ్ బాయ్ చెప్పేస్తా. No controversies. I don’t want any controversies in my life’ అని ట్వీట్ చేశారు. ఆయన ట్వీటాడినా, మాట్లాడినా నవ్వు తెప్పిస్తారనేందుకు ఈ ట్వీట్ కంటే నిదర్శనం లేదు.
‘త్వరలో ట్విట్టర్‌కి గుడ్ బాయ్ చెప్పేస్తా. వివాదాలు వద్దు. జీవితంలో వివాదాలకు చోటు ఉండకూడదని కోరుకుంటున్నా’ అని ఆయన ప్రకటించారు. ఆయన ట్వీట్‌ను గమనిస్తే…గుడ్ బై అనే బదులు గుడ్ బాయ్ అని పేర్కొన్నారు. ఇలాంటి కామెడీ తురుపు ముక్కలు మిస్ అవుతామనేదే నెటిజన్ల బాధ, ఆవేదన.