ఆదేశించి రెండేళ్లైనా …చర్యలు తీసుకోరా?

ఏపీ, తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీపై జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. తాము ఆదేశించి రెండేళ్లు అవుతున్నా… ఇంత వ‌ర‌కూ చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం ఏంట‌ని ఎన్‌హెచ్ఆర్‌సీ…

ఏపీ, తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీపై జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. తాము ఆదేశించి రెండేళ్లు అవుతున్నా… ఇంత వ‌ర‌కూ చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం ఏంట‌ని ఎన్‌హెచ్ఆర్‌సీ మండిప‌డింది. 

విద్యార్థులు మాన‌సిక ఒత్తిళ్ల‌కు గురి అవుతూ, ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ సుప్రీంకోర్టు న్యాయ‌వాది చేసిన ఫిర్యాదుపై ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియ‌స్‌గా స్పందించింది.

ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై నివేదిక స‌మ‌ర్పించాల‌ని గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో రెండు రాష్ట్రాల సీఎస్ ల‌ను ఎన్‌హెచ్ఆర్‌సీ ఆదేశించింది. అయితే అటు వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ఆత్మ‌హ‌త్య‌ల‌ను అడ్డుకునే శాస్త్రీయ చ‌ర్య‌ల గురించి నివేదిక స‌మ‌ర్పించ‌ని రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల‌పై ఎన్‌హెచ్ఆర్‌సీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఈ నేప‌థ్యంలో నాలుగు వారాల్లో స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని మ‌రోసారి ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. గడువులోగా నివేదిక ఇవ్వకపోతే త‌మ‌ ఎదుట హాజరుకావాల్సి వస్తుందని ఎన్‌హెచ్ఆర్‌సీ హెచ్చరించింది. 2019 రికార్డుల ప్రకారం 426 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్‌హెచ్ఆర్‌సీ తెలిపింది.