అయ్యన్నకు గట్టిగా బిగుసుకుంటోందా…..?

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే చెబుతున్నాయి. అయ్యన్నపాత్రుడు కొద్ది రోజుల క్రితం చేసిన ఘాటు కామెంట్స్ ఇపుడు…

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే చెబుతున్నాయి. అయ్యన్నపాత్రుడు కొద్ది రోజుల క్రితం చేసిన ఘాటు కామెంట్స్ ఇపుడు ఆయనకు పెద్ద చిక్కులే తెచ్చిపెడుతున్నాయనుకోవాలి.

ఇంత దాకా అటూ ఇటూ మాటాల తూటాలు మాత్రమే పేలాయి. ఇపుడు పక్కా యాక్షన్ కి రంగం సిద్ధమవుతోంది అంటున్నారు. అయ్యన్నపాత్రుడు గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి జగన్, హోం మంత్రి సుచరితల మీద చేసిన హాట్ హాట్  కామెంట్స్ తో పలు సెక్షన్ల కింద తాజాగా  కేసులు నమోదు అయ్యాయి.

వాటిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉంది. అలాగే సీఎం మీద వ్యక్తిగత విమర్శలు చేసినందుకు గానూ న్యాయవాది ఒకరు చేసిన ఫిర్యాదు మీద కూడా కేసులు పడ్డాయి. ఇవన్నీ ఇలా ఉంటే మాజీ మంత్రి మీద విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ నేతలు చేసిన అవినీతి అక్రమాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది అంటున్నారు. 

అయ్యన్నకు సంబంధించిన మొత్తం చిట్టా డేటా కూడా ప్రభుత్వ పెద్దల వద్దకు చేరింది అని చెబుతున్నారు. మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయో అన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ఉంది.