Advertisement

Advertisement


Home > Movies - Movie News

'మర్డర్' చేయకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు

'మర్డర్' చేయకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు

రామ్ గోపాల్ వర్మ కు కోర్టు కేసులు కొత్తకాదు. ఓవైపు కేసులు నడుస్తున్నప్పటికీ తను అనుకున్నది తాను తీస్తాడు. జనాలపైకి వదుల్తాడు. ఇప్పుడు మర్డర్ అనే సినిమాపై కూడా కేసు పడింది. కానీ వర్మ వెనక్కి తగ్గలేదు. కోర్టు కేసు పడినప్పటికీ మర్డర్ సినిమా చేస్తానని విస్పష్టంగా ప్రకటించాడు.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. ప్రణయ్ హత్య కేసు, మారుతిరావు ఆత్మహత్య పాయింట్స్ ను బేస్ చేసుకొని మర్డర్ అనే సినిమా ప్రకటించాడు వర్మ. ఆ వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఉన్న మొయినాబాద్ లోని ఓ గెస్ట్ హౌజ్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అయితే సినిమా కోసం ప్రణయ్, అమృత, మారుతిరావు ఫొటోలు వాడారని, పేర్లను కూడా యథాతథంగా వాడుతున్నారంటూ ప్రణయ్ తండ్రి కోర్టును ఆశ్రయించాడు. అయితే సినిమా షూటింగ్ ను నిలిపివేయాలన్న వాదనను తోసిపుచ్చిన కోర్టు.. దర్శక-నిర్మాతలపై కేసు నమోదుచేయాలని మిర్యాలగూడ పోలీసుల్ని ఆదేశించింది. దీనిపై వర్మ ఘాటుగా స్పందించాడు. ఎట్టిపరిస్థితుల్లో తను సినిమా తీస్తానంటున్నాడు.

"నేను ఎవ్వర్నీ కించపరచడానికి ఈ సినిమా తీయడం లేదు. సమాజంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా సినిమా చేస్తున్నాను. నా హక్కుల పరిరక్షణ కోసం దీనిపై నేను కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతాను."

ఫాదర్స్ డే సందర్భంగా ప్రణయ్, మారుతిరావు, అమృత పేర్లు వచ్చేలా ట్వీట్ చేశాడు వర్మ. "మారుతి వధించిన ప్రణయామృత విషాధ గాధ" అంటూ మర్డర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఇలా తమ పేర్లు వాడడం పై అమృత కుటుంబం అభ్యంతరం వ్యక్తంచేస్తోంది.

ఇడ్లీపాత్ర లాగా ఉప్మాగిన్ని లాగా డిజైన్లు చేశారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?