గ్లామరస్ వరల్డ్ లో కొంత పేరు వస్తే చాలు.. ఆ పేరే ఒక బ్రాండ్ గా మారుతుంది! ఆ క్రేజ్ ను సెలబ్రిటీలు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. స్టార్ హోదా వచ్చిన తర్వాత వారు వివిధ బ్రాండ్లకు అంబాసిడర్లుగా మారుతూ ఉంటారు. వాటిని ప్రమోట్ చేస్తూ ఆదాయం సంపాదించుకుంటూ ఉంటారు. మరి అలా సంపాదించడమే కాదు, కొందరు మరో అడుగు ముందుకు వేసి తామే సొంత బ్రాండ్లకు యజమానులు మారుతున్నారు గత కొంతకాలంగా.
తమ పేరునే బ్రాండ్ గా చేసుకుని వ్యాపారం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఫ్యాషన్ వరల్డ్ లో ఇప్పుడు సెలబ్రిటీల సొంత బ్రాండ్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ జాబితాను ఒకసారి పరిశీలిస్తే…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ వ్యాపారరంగంలోకి దూసుకుపోతోంది. సొంతంగా ఆమె సినీ నిర్మాణం చేపడుతూ వస్తోంది. ఈ విధంగా కొన్ని హిట్స్ ను కొట్టి కోట్ల రూపాయలను సంపాదించింది. అంతేకాదు.. ఆమెకు నుష్ పేరిట ఒక ఫ్యాషన్ వేర్ బ్రాండ్ ఉంది. 2017 నుంచి ఆమె ఈ బ్రాండ్ వ్యాపారం చేస్తోంది. క్యాజువల్ వేర్, స్పోర్ట్స్ వేర్, ఫ్యాషనబుల్ డ్రస్ లు అనుష్క వ్యాపారంలో భాగం.
హెచ్ఆర్ఎక్స్ ఈ బ్రాండ్ ప్రమోటర్ గా హృతిక్ రోషన్ ఫొటో ఉంటుంది. ప్రధానంగా ఫుట్ వేర్, స్పోర్ట్స్ వేర్ వ్యాపారంలో హెచ్ఆర్ఎక్స్ ఔట్ లెట్ లు పెద్ద పెద్ద మాల్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఈ వ్యాపారానికి హృతిక్ బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు యజమాని కూడా!
రాంగ్() ఈ బ్రాండ్ టీషర్ట్ లు, షర్ట్ లు, షూస్ పాపులర్. మాల్స్ లో ఈ బ్రాండ్ షోరూమ్ లు ఉంటాయి. ఈ బ్రాండ్ తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. మరి దీని వెనుక విరాట్ కొహ్లీ హస్తం ఉంది. కేవలం ప్రమోటర్ గానే కాకుండా.. దీని కోఓనర్ గా కూడా విరాట్ దీన్ని నడిపిస్తున్నాడు.
నైకా.. మెన్, విమెన్ ఫ్యాషన్ లో దూసుకుపోతున్న మరో బ్రాండ్. షాపింగ్ మాల్స్ లోనే కాదు, ఇకామర్స్ లో కూడా నైకా పేరు పాపులర్ అవుతోంది. మరి ఈ బ్రాండ్ లో పార్టనర్ గా దాన్ని ప్రమోట్ చేస్తోంది కత్రినాకైఫ్.
స్టార్ స్ట్రక్ పేరుతో లిప్ స్టిక్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఉంది సన్నీ లియోన్. దానికి ఆమె యజమాని కూడా. సోనమ్ కపూర్, ఆమె సోదరికి కూడా ఒక చోటా డ్రస్సింగ్ బ్రాండ్ సొంతంగా ఉంది.
ఇంకా లారాదత్తా, సైఫ్ అలీఖాన్ లకు కూడా సొంతంగా ఫ్యాషన్, డ్రస్ బ్రాండింగ్ వ్యాపారాలున్నాయి. తెలుగు సెలబ్రిటీలు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బ్రాండ్ కు పేరొస్తే చాలు భారీ లాభాలు ఉన్న వ్యాపారాలు ఇవి. అందుకే తారల ప్రయత్నాలు ఇలా సాగుతున్నట్టున్నాయి.