మీడియా అత్యుత్సాహం అన్నది ఒక్కోసారి భలేగా వుంటుంది. పీపుల్స్ మీడియా సంస్థ రాజ రాజ చోర అనే ఓ చిన్న సినిమా నిర్మించింది.
శ్రీవిష్ణు హీరో. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది. మరో నాలుగైదు రోజులు వర్క్ వుంది. అప్పుడు కానీ సెన్సారుకు వెళ్లదు. కానీ ఈలోగా ఈ సినిమా సెన్సారు అయిపోయిందని, యు/ఎ సర్టిఫికెట్ వచ్చేసిందని డిసైడ్ చేసేసారు. అంటే ఈ రోజుల్లో దేనికైనా ఇదే సర్టిఫికెట్ కదా అని ఫిక్స్ అయిపోయి వుంటారు.
సరే అక్కడితో ఆగలేదు వ్యవహారం. సినిమాను ఓటిటికి జీ-5 కు ఇచ్చేసారని కూడా ప్రకటించేసారు. నిజానికి శాటిలైట్ మాత్రమే జీ చానెల్ కు ఎప్పుడో ఇచ్చేసారు.
ఇప్పుడు ఓటిటికి ఇవ్వాలంటే మళ్లీ వాళ్లతోనే మాట్లాడుకోవాలి. వాళ్లు ఆసక్తి చూపించాలి. ఈ విషయంలో నిర్మాత కాస్త ఆసక్తిగానే వున్నారు తప్ప అట్నుంచి ఇంకా ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది.
అలా వస్తే అప్పుడు రేట్లు, బేరాలు, డిస్కషన్లు స్టార్ట్ అవుతాయి. కానీ ఈ లోగా థియేటర్లు తెరచుకోవడం ఎలాగూ వుంటుంది. అప్పటి సంగతి ఓటిటినా? థియేటర్ నా? అన్నది తేలుతుంది.