గోపీచంద్ కు రెండు హిట్ లు ఇచ్చిన డైరక్టర్ శ్రీవాస్. లౌక్యం, లక్ష్యం సినిమాలు రెండూ గోపీచంద్ కెరీర్ లో మంచి సినిమాలే. మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అవుతోంది.
సాక్ష్యం తరువాత డైరక్టర్ శ్రీవాస్ కు కాస్త గ్యాప్ వచ్చింది. ఆ మధ్య డివివి దానయ్య కుమారుడితో సిన్మా ప్లాన్ చేసారు. అది అలా వుండగనే గోపీచంద్ కోసం మరో సబ్జెక్ట్ ను రెడీ చేసారు.
ఇప్పుడు ఇదే ముందు తెరకెక్కుతోంది. కాస్త భారీ ఖర్చుతో కూడిన సినిమానే. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ సబ్జెక్ట్ తో తెరక్కెక్కించే ఈ సినిమాను ఓ పాపులర్ బ్యానర్ నిర్మించబోతోంది. ఈమేరకు ఇవ్వాళో,రేపో అనౌన్స్ మెంట్ వస్తుంది.
గోపీచంద్ ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో ఒకటి, సంపత్ నంది డైరక్షన్ లో మరొకటి చేస్తున్నారు. వీటిలో సీటీమార్ పూర్తయింది. పక్కా కమర్షియల్ ఆగస్టులో పూర్తవుతుంది. ఆ వెంటనే శ్రీవాస్ సినిమా స్టార్ట్ అవుతుంది.