Advertisement

Advertisement


Home > Movies - Movie News

చైతన్య చేత చెప్పించుకున్న బాలయ్య

చైతన్య చేత చెప్పించుకున్న బాలయ్య

చిన్నవాళ్లకి పెద్దవాళ్లు సుద్దులు చెప్పాలి. ఇలా మాట్లాడాలి..ఇలా మాట్లాడకూడదు అని. కానీ నందమూరి బాలయ్య లాంటి 60 ఏళ్లు దాటిన పెద్దాయినకు, పట్టుమని మూడు పదులు దాటిన నాగ్ చైతన్య సుద్దులు చెప్పాల్సి వస్తోంది. 

అక్కినేని..తొక్కినేని అని మాట తూలినందుకు బాలయ్య ను తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా జనాలు ఓ లెక్కలో వేసుకుంటున్నారు. అక్కినేని లాంటి మహానటుడిని అలా తూలనాడడం ఏమిటి అని క్లాస్ లు పీకుతున్నారు.

ఇది అలా అలా వెళ్లి ఆఖరికి అక్కినేని మనుమడు నాగ్ చైతన్య ఏకంగా ఓ పోస్ట్ నే పెట్టారు ట్విట్టర్ లో. పెద్దలు ఎఎన్నార్..ఎన్టీఆర్..ఎస్వీఆర్ లను మనమే కించపర్చడం తగదు అంటూ. ఆ మాత్రం చాలు..పెద్దగా మాటలు అవసరం లేదు ఎదుటి మనిషికి గట్టిగా తగిలేందుకు. కానీ బాలయ్య ఇలాంటివి అన్నీ పట్టించుకునే రకం కాదు. లైట్ తీసుకునే రకం.

కానీ జనాల దృష్టిలో మాత్రమే కాదు, ఇండస్ట్రీ జనాలు కూడా బాలయ్య స్పీచ్ ను ఆఫ్ ది రికార్డు గా అయినా ఖండిస్తున్నారు. ‘ఆయనకు మాట్లాడడం రాదు. ఏం మాట్లాడేస్తారో ఆయనకే తెలియదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా