నాగ్ చైతన్య-సాయి పల్లవిల లవ్ స్టోరీ పూర్తయింది. కరోనా కారణంగా పక్కన వుండిపోయిన సినిమాల్లో ఇది ఒకటి. కరోనా తరువాత ముందుగా ప్రారంభమైన సినిమా కూడా ఇదే.
ఈ సినిమా షూట్ మొత్తం ఇటీవలే పూర్తి చేసుకుని, గుమ్మడికాయ కొట్టేసారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఇప్పటికే డబ్బింగ్ దాదాపు పూర్తయింది. ఇక మిగిలిన పనులు మొదలుపెట్టారు.
ఆసియన్ సునీల్ నిర్మించే ఈ సినిమాను క్రిస్మస్ బరిలోకి దింపాలని అనుకున్నారు. కానీ యాభై శాతం ఆక్యుపెన్సీ వుంటే అలా చేయడం కష్టం అవుతుందని భావిస్తున్నారు.
అందుకే వందశాతం ఆక్యుపెన్సీ వస్తే క్రిస్మస్ కు లేదూ అంటే సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత సునీల్ భావిస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు సంక్రాంతికి రుమాలు వేసాయి కానీ సునీల్ కు నైజాంలో స్వంత థియేటర్లు భారీగా వున్న అడ్వాంటేజ్ వుంది.
ఫిదా తరువాత శేఖర్ కమ్ముల అందిస్తున్న సినిమా కావడం, మళ్లీ ఆయన డైరక్షన్ లో సాయిపల్లవి నటించడం వల్ల ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి.