గత వారం రిలీజైన ఆకాశం నీ హద్దురా, మా వింత గాధ వినుమా సినిమాల్లో సూర్య సినిమా సూపర్ హిట్టవ్వగా.. సిద్ధూ చేసిన సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాతొచ్చిన నయనతార మూవీ అమ్మోరు తల్లి యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది.
ఈ వీకెండ్ కూడా మరో 2 సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. వీటిలో ఒకటి పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ పోషించిన అనగనగా ఓ అతిథి కాగా.. రెండోది ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలొడీస్.
పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ పోషించిన సినిమా అనగనగా ఓ అతిథి. డీ-గ్లామరైజ్డ్ రోల్ పోషించిన పాయల్, ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ క్యారెక్టర్ కోసం ఆమె బరువు తగ్గింది కూడా. నిన్ననే వెంకటేష్ చేతుల మీదుగా ట్రయిలర్ లాంచ్ అయింది. మరో 2 రోజుల్లో (20న) ఆహాలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
ఇప్పటివరకు ఆహాలో సరైన సినిమా పడలేదు. ఒరేయ్ బుజ్జిగా, కలర్ ఫొటో ఓకే అనిపించుకున్నప్పటికీ.. ఆకాశం నీ హద్దురా టైపులో హిట్ అనిపించుకున్న సినిమా ఒక్కటి లేదు. కనీసం పాయల్ సినిమానైనా ఆహాకు కలిసొస్తుందేమో చూడాలి.
ఇక ఆనంద్ దేవరకొండ రెండో సినిమా కూడా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. వినోద్ అనంతోజు డైరక్టర్ గా మారి తీసిన మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమా 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లోకి వస్తోంది. ఈ సినిమాపై కూడా పెద్దగా అంచనాల్లేవు.
ఒకేరోజు రెండు ఓటీటీ వేదికలపైకి వస్తున్న ఈ రెండు సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.