కెరీర్ లో గ్యాప్స్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు నాగచైతన్య. చివరికి సమంతను పెళ్లాడిన టైమ్ లో కూడా ఈ హీరో గ్యాప్ తీసుకోలేదు. వెంటనే సెట్స్ పైకి వచ్చేశాడు. అప్పట్నుంచి ఇప్పటివరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్న నాగచైతన్య.. కొత్త ఏడాదికి సంబంధించి ఫ్రెష్ గా మరో లైనప్ సిద్ధం చేశాడు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు చైతూ. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్ యూ అనే మూవీని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
విక్రమ్ కుమార్ సినిమా తర్వాత కూడా మరో 2 సినిమాల్ని లైన్లో పెట్టాడు చైతూ. ప్రస్తుతం వెంకీ అట్లూరితో చర్చలు జరుపుతున్నాడు ఈ హీరో. ఆల్రెడీ అఖిల్ తో మిస్టర్ మజ్ను తీసిన వెంకీ అట్లూరి.. ఇప్పుడు చైతూ కోసం కూడా ఓ మంచి ఫ్యామిలీ-లవ్ ఎంటర్ టైనర్ కథ సిద్ధం చేశాడు.
వీటితో పాటు పరశురామ్ దర్శకత్వంలో సినిమా కూడా చేయబోతున్నాడు నాగచైతన్య. ఈ మూవీ ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఇటు హీరో, అటు దర్శకుడు ఇద్దరి వద్ద అడ్వాన్సులు రెడీగా ఉన్నాయి.
సో.. లవ్ స్టోరీ మూవీతో కలుపుకొని నాగచైతన్య చేతిలో ఆల్రెడీ 4 సినిమాలు రెడీగా ఉన్నాయన్నమాట. అలా మరో రెండేళ్లకు సరిపడా సినిమాల్ని ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టుకున్నాడు ఈ హీరో.