చైతూ నిన్నే అడిగేది… వినిపిస్తోందా?

స్టార్ హీరోయిన్‌, అక్కినేని వారి కోడ‌లు స‌మంత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. మ‌రీ ముఖ్యంగా గ్లామ‌ర్ రంగంలో శ‌ర వేగంగా వ‌స్తున్న మార్పుల‌కు అనుగుణంగా, త‌న‌ను తాను తీర్చిదిద్దుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు. …

స్టార్ హీరోయిన్‌, అక్కినేని వారి కోడ‌లు స‌మంత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. మ‌రీ ముఖ్యంగా గ్లామ‌ర్ రంగంలో శ‌ర వేగంగా వ‌స్తున్న మార్పుల‌కు అనుగుణంగా, త‌న‌ను తాను తీర్చిదిద్దుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు. 

వెబ్ సిరీస్‌లు చేయ‌డంతో పాటు ఆ ప్లాట్‌ఫామ్‌పై వ్యాఖ్యాత‌గా కూడా ఆమె కొత్త అవ‌తారం ఎత్తారు. ఇందులో కూడా స‌మంత అదుర్స్ అనిపించారు.

ఇదిలా ఉండ‌గా త‌న ప్రియ‌మైన భ‌ర్త , హీరో నాగ‌చైత‌న్య‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె ఓ చిలిపి ప్ర‌శ్న వేశారు. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

హీరో నాగ‌చైత‌న్య ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న త‌న ఫొటోను షేర్ చేశాడు.  `థ్యాంక్యూ` సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తీసిన ఫొటో ఇది. ఈ ఫొటో చైతూకు బాగా నచ్చ‌డంతో ఇన్ స్టాగ్రామ్‌లో త‌న అభిమానుల కోసం షేర్ చేశాడు.

ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో చైతూ దీర్ఘాలోచనలో నిమ‌గ్న‌మైన‌ట్టు క‌నిపిస్తాడు. ఈ ఫొటోపై నెటిజ‌న్లు వివిధ ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. 

ఇందులో భాగంగా  చైతూ భార్య సమంత ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. `నువ్వు నా గురించే అలోచిస్తున్నావా?` అంటూ స‌ర‌దాగా త‌న భ‌ర్త‌కు కొంటె ప్ర‌శ్న వేశారామె. సమంత కామెంట్ నెటిజ‌న్ల‌ను ఫిదా చేస్తోంది. మ‌రి చైతూ ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

గెరిల్లా యుద్దమే చేయాలి