Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆస్కార్ పట్టుకొని మూలాల్లోకి వెళ్లిన చంద్రబోస్

ఆస్కార్ పట్టుకొని మూలాల్లోకి వెళ్లిన చంద్రబోస్

"ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడే కలిశాము" అనే పాటను చాన్నాళ్ల కిందటే రాశాడు చంద్రబోస్. ఇప్పుడు నిజజీవితంలో కూడా దాన్ని నిజం చేసి చూపిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డ్ అందుకున్న ఈ పాటల రచయిత, తన మూలాల్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఆస్కార్ పట్టుకొని, తనకు ఇంత ఖ్యాతి తీసుకొచ్చిన వ్యక్తుల్ని కలుస్తున్నాడు. స్థలాల్ని సందర్శిస్తున్నాడు.

ఆస్కార్ తో హైదరాబాద్ లో అడుగుపెట్టిన చంద్రబోస్ కు ఘనస్వాగతం లభించింది. అలా అపూర్వ స్వాగతం మధ్య ఇంటికి చేరుకున్న చంద్రబోస్, ఆ వెంటనే రామానాయుడు స్టుడియోస్ కు వెళ్లారు. దాదాపు 28 ఏళ్ల కిందట ఇక్కడే ఆయన తొలి పాట రాశారు.

అందుకే ఆస్కార్ తో పాటు ఆ ప్రాంతాన్ని సందర్శించారు చంద్రబోస్. తన కెరీర్ తొలినాళ్లను, రామానాయుడు తనను ప్రోత్సహించిన వైనాన్ని గుర్తుచేసుకున్నారు. తను ఆస్కార్ అందుకున్న సందర్భంగా మనసులో రామానాయుడుకు, ప్రత్యక్షంగా సురేష్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇక తనకు పాటల రచయితగా గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావును కలిశారు చంద్రబోస్. సూపర్ హిట్ సాంగ్స్ రాసే అవకాశం ఇచ్చిన దర్శకేంద్రుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పారు.

కెరీర్ ప్రారంభించిన 28 ఏళ్లలో ఒక్క రోజు కూడా తన చేయి వదిలిపెట్టకుండా, కన్నకొడుకు కంటే ఎక్కువగా తనను చూసిన రాఘవేంద్రరావుకు శిరస్సువంచి నమస్కరించాడు చంద్రబోస్.

ఆస్కార్ వచ్చిన సందర్భంగా, ఇలా తన కెరీర్ కు సహకరించిన వ్యక్తుల్ని, పనిచేసిన ప్రదేశాల్ని చంద్రబోస్ గుర్తుచేసుకోవడాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?