Advertisement

Advertisement


Home > Movies - Movie News

మహేష్ సినిమా కు త్రివిక్రమ్ ...?

మహేష్ సినిమా కు త్రివిక్రమ్ ...?

త్రివిక్రమ్-మహేష్ బాబు సినిమా ఆగస్టు 11న విడుదల అని ముందే చెప్పారు. అలా చెప్పినా కూడా మెగాస్టార్ భోళాశంకర్ సినిమా అదే రోజు విడుదల అని ప్రకటించేసారు. ఏ ధైర్యంతో అయి వుంటుంది. మహేష్ సినిమా రాదు అనే కదా? అలాంటి ధీమా ఎందుకు వచ్చింది. 

మహేష్ బాబు సినిమా వస్తుందో రాదో త్రివిక్రమ్ కు తెలిసినంతగా మరెవరికి తెలియదు. ఎవరు ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ సినిమాల కర్త, కర్మ, క్రియ త్రివిక్రమ్ నే అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రోజు కూడా అదే జ‌రిగింది. త్రివిక్రమ్ నే స్వయంగా కీలక సమావేశం పెట్టి పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న వినోదయ సితం రీమేక్ కు డేట్ నిర్ణయించారు.

ఇప్పుడు ఇదే ఫ్యాన్స్ కు మండుతోంది. తమ సినిమాను వదిలేసి త్రివిక్రమ్ ఏదేదో చేస్తున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తన్నారు. ఇది ఇలా వుంటే మహేష్ సినిమా నిర్మాతలు కూడా పైకి కక్కలేక మింగలేక అన్నట్లు వున్నారు. తమ సినిమా డైరక్టర్ అందువల్ల మరేం మాట్లాడలేరు. అందులోనూ త్రివిక్రమ్ గీసిన గీత దాట లేరు. తమ సినిమా విడుదలను సంక్రాంతికి మార్చాలన్నా కాస్త ముందు వెనుక చూసి, మెల్లగా ఓ ప్లాన్ ప్రకారం మార్చి వుండేవారు. కానీ ఇప్పుడేమయింది. త్రివిక్రమ్ నే హింట్ ఇచ్చినట్లు అయింది తమ సినిమా అగస్ట్ 11 కు రాదని.

ఎందుకంటే త్రివిక్రమ్ స్క్రిప్ట్, మాటలు రాసిన సినిమా జూలై 28న వస్తుంటే అదే సినిమాకు పని చేసిన టెక్నీషియన్లు థమన్, నవీన్ నూలి పనిచేయాల్సిన మహేష్ సినిమా రెండు వారాలు గ్యాప్ లో ఎలా వచ్చేస్తుంది దీనికే పని చేస్తారా? దానికే పని చేస్తారా? కేవలం  ఇరవై అయిదు రోజుల పని దినాలకు పవన్ 65 నుంచి 70 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని టాక్. ఈ రీమేక్ స్క్రిప్ట్ కు, ప్రాజెక్ట్ సెట్ చేసినందుకు త్రివిక్రమ్ పదిహేను కోట్ల వరకు తీసుకున్నారని టాక్ కూడా వుంది. అందుకే త్రివిక్రమ్ దానికి సరైన డేట్ చేసి, మహేష్ సినిమాను మెల్లగా సంక్రాంతి దిశగా నడిపిస్తవున్నారా అన్న అనుమానాలు కూడా టాలీవుడ్ లో వ్యక్తం అవుతున్నాయి.

సంక్రాంతి అంటే బోలెడు పోటీ వుంటుంది. వస్తాయో రావో తెలియదు కానీ రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇలా చాలా మంది సినిమాలు సంక్రాంతి బరిలో దూకే అవకాశం అయితే వుంది. మహేష్ సినిమా సంగతేమిటో డిసెంబర్ వరకు క్లారిటీ రాదేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?