ఛాలెంజింగ్ స్టార్, కన్నడ నటుడు దర్శన్ మెడకు గట్టిగా ఉచ్చు బిగుసుకుంది. వీరాభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న దర్శన్ పై, తాజాగా పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు.
3991 పేజీల భారీ ఛార్జ్ షీటులో దర్శన్-పవిత్రతో పాటు మిగతా 15 మంది నిందితులపై 200 సాక్ష్యాధారాల్ని ప్రవేశపెట్టారు. వీటిలో అత్యంత కీలకమైన రక్తపు మరకల సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. దర్శన్-పవిత్ర దుస్తులు, షూ నుంచి రేణుకా స్వామి రక్తపు మరకల ఆనవాళ్లను పోలీసులు రాబట్టారు. మొత్తం కేసుకు ఇదే కీలకం అంటున్నారు.
ఈ సాక్ష్యాధారాలతో పాటు.. క్రైమ్ సీన్ లో తీసిన ఫొటోను కూడా సంపాదించారు పోలీసులు. ఆ ఫొటోలో పలువుర్ని రేణుకా స్వామి తనను చంపొద్దని కాళ్లావేళ్లా పడుతున్నట్టు ఉంది. ఇలాంటి కీలకమైన సాక్ష్యాలతో 8 వాల్యూమ్స్ తో ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఏసీపీ చందన్ కుమార్ నేతృత్వంలోని పోలీసుల బృందం.. ఈ ఛార్జ్ షీట్ ను ఈరోజు మెజిస్ట్రేట్ కు సమర్పించారు.
రేణుకాస్వామి హత్య కేసులో జూన్ 11న దర్శన్ తో పాటు మిగతా నిందితుల్లో కొంతమందిని అరెస్ట్ చేశారు. వీళ్లంతా వివిధ జైళ్లలో జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈనెల 9 వరకు దర్శన్ కు రిమాండ్ ఉంది.
అంతలోనే అతడికి వ్యతిరేకంగా భారీ ఛార్జ్ షీట్ దాఖలైంది. ఇందులో పవిత్ర గౌడను ఏ-1గా, దర్శన్ ను ఏ-2గా పేర్కొన్నారు. సెక్షన్-164 కింద ముగ్గురు ప్రత్యక్ష సాక్ష్యులు, 27 మంది వ్యక్తుల సాక్ష్యాలు, 8 మంది ప్రభుత్వ అధికారుల సాక్ష్యాలతో పాటు.. మొత్తంగా 231 మందిని సాక్షులుగా ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు.
తాజాగా పరప్పన అగ్రహార జైలులో దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్న ఫొటో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ నాగరాజు అలియాస్ విల్సన్ గార్డెన్ నాగతో కలిసి దర్శన్ సిగరెట్, టీ తాగుతున్న ఫొటో బయటకు వచ్చింది. దీంతో దర్శన్ ను బళ్లారిలోని సెంట్రల్ జైలుకు తరలించారు.
vc estanu 9380537747
vc available 9380537747
VC ante entraa erri
VC ante enti r a e r r p00
Video call RA puuka
Video call puuka
Video call..
Visa anukunta