చార్మీ మాటలు…కన్నీళ్లు ఎందుకు?

రాజకీయాల్లో, సినిమాల్లో సింపతీ ఫ్యాక్టర్ అన్నది చాలా కీలకంగా వుంటుంది. వన్స్ సింపతీ జనరేట్ కావాలే కానీ అది ఇచ్చే పాజిటివ్ వైబ్ వేరు. దాని వల్ల వచ్చే ఫలితం వేరు. ఇటీవల కార్తికేయ…

రాజకీయాల్లో, సినిమాల్లో సింపతీ ఫ్యాక్టర్ అన్నది చాలా కీలకంగా వుంటుంది. వన్స్ సింపతీ జనరేట్ కావాలే కానీ అది ఇచ్చే పాజిటివ్ వైబ్ వేరు. దాని వల్ల వచ్చే ఫలితం వేరు. ఇటీవల కార్తికేయ 2 సినిమా విషయంలో ఈ సింపతీ ఫ్యాక్టర్ బాగా ఉపయోగపడింది. మాంచి ఓపెనింగ్స్ తెచ్చింది. చూస్తుంటే ఇదే టెక్నిక్ ను తన సినిమాకు కూడా నిర్మాత చార్మి వాడాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది.

నిజానికి లైగర్ సినిమాకు ఇలాంటి టెక్నిక్ లు ఏమీ అక్కరలేదు. ఇప్పటికే ఆ సినిమాకు భయంకరమైన బజ్ వుంది. బుకింగ్స్ ఓపెన్ అయితే చాలు టికెట్ లు హాట్ కేక్ లు కావడం పక్కా. తొలి మూడు రోజులు పక్కా కలెక్షన్లు వుంటాయి. తరువాత ఎలా వుంటాయన్నది సినిమాను బట్టి వుంటుంది. ఇలా మాంచి బజ్ వుండి, ఓపెనింగ్స్ పక్కా అని క్లారిటీగా తెలుస్తున్నా కూడా చార్మి ఎందుకు వీడియోల ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నది ప్రశ్న.

ఇస్మార్ట్ శంకర్ కు మంచి డబ్బులు వచ్చాయి. చార్మి, పూరి మంచి వాహనాలు కొనుక్కున్నారు. అప్పులు తీర్చేసారు అని వార్తలు కూడా వచ్చాయి. లైగర్ కు ఫైనాన్సియర్లు వుండనే వున్నారు. నార్త్ లో కూడా మంచి భాగస్వాములు కలిసారు. డబ్బు ఇబ్బంది లేనే లేదు. మరి ఎందుకు చాలా సార్లు చార్మి ఈ సినిమాను ఫినిష్ చేయడానికి కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది అన్నది తెలియాల్సి వుంది.

అలా అని సినిమాకు భారీ స్టార్ కాస్ట్ ఏమీ లేదు. విజయ్, రమ్యకృష్ణ, మైక్ టైసన్ వీరికే మాంచి రెమ్యూనిరేషన్లు ఇవ్వాలి. అనన్య పాండే కు రీజనబుల్ రెమ్యూనిరేషన్ ఇచ్చి వుంటారు. ఇక మిగిలిన వారంతా పెద్దగా రెమ్యూనిరేషన్ డిమాండ్ చేసే నటులు కాదు. ఖర్చంతా ప్రొడక్షన్ కే. పైగా విజయ్ తనకు ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కు ఇచ్చి అప్పులు తీర్చేయండి అన్నారు అని పూరినే చెప్పారు. పైగా నిర్మాణంలో వుండగానే కొంతమంది బయ్యర్లు అడ్వాన్స్ లు పంపారు కూడా.

ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో? చార్మి ఎందుకు పదే పదే కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందో, రాను రాను బయటకు వదిలే ప్రీ రిలీజ్ కంటెంట్ లో తెలుస్తుందేమో?