‘కత్తి’ పట్టిన కింగ్

సీనియర్ నాగార్జున లేటెస్ట్ సినిమా ఘోస్ట్. ఈ సినిమా 25న ట్రయిలర్ విడుదల కాబోతోంది. ఈలోగా ఓ చిన్న ఇంట్రస్టింగ్ వీడియో కట్ చేసారు.  Advertisement జపాన్ ప్రాంతంలో దొరికే టఫ్ ఐరన్ మెటల్…

సీనియర్ నాగార్జున లేటెస్ట్ సినిమా ఘోస్ట్. ఈ సినిమా 25న ట్రయిలర్ విడుదల కాబోతోంది. ఈలోగా ఓ చిన్న ఇంట్రస్టింగ్ వీడియో కట్ చేసారు. 

జపాన్ ప్రాంతంలో దొరికే టఫ్ ఐరన్ మెటల్ ను ఓ బలమైన కత్తిగా మార్చి, తన మీదకు దండెత్తే వారి కోసం హీరో నాగ్ సిద్దం కావడం అన్నది ఈ విడియో. కేవలం ఆరు తూటాలు వుండే రివాల్వర్ కన్నా ఈ ఆయుధమే బలమైనది అన్న ఆలోచనతో హీరో స్వయంగా ఆ లోహాన్ని కరిగించి కత్తిని తయారు చేసుకుంటాడు.

ఈ స్వోర్డ్ మేకింగ్ విడియోను ఇంటస్రింగ్ గా చిత్రీకరించారు. లైటింగ్ మూడ్, బ్యాక్ గ్రవుండ్ స్కోర్, నాగ్ ఆటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ పెర్ ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ప్రవీణ్ సత్తారు తనకు యాక్షన్ మేకింగ్ స్టయిల్ ను మరోసారి చూపించాడు.

ఆసియన్ సునీల్, శరత్ మరార్, రామ్మోహనరావు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల డేట్ కూడా ఇప్పటికే అనౌన్స్ చేసారు. అక్టోబర్ 5 న మెగాస్టార్ గాడ్ ఫాదర్ కు పోటీగా ఈ సినిమా విడుదల అవుతుండడం విశేషం. మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు.