చిన్న సినిమాకు పెద్ద సపోర్ట్

యువి లాంటి పెద్ద సంస్థ నిర్మించిన చిన్న సినిమా ఏక్ మినీ కథ. థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటిటి దారి పట్టింది.  Advertisement అయితే అలా అని…

యువి లాంటి పెద్ద సంస్థ నిర్మించిన చిన్న సినిమా ఏక్ మినీ కథ. థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటిటి దారి పట్టింది. 

అయితే అలా అని చెప్పి మేకర్లు సినిమాను వదిలేయలేదు. బలంగా ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా టాప్ హీరోలు ఈ చిన్న సినిమాను సపోర్ట్ చేయడం విశేషం.

బాహుబలి ప్రభాస్ ఇప్పటికే ఏక్ మినీ కథను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో స్టేట్ మెంట్ ఇచ్చేసారు. మరో హీరో రామ్ చరణ్ కూడా ఇప్పుడు అదే చేసారు. చిత్ర ట్రైల‌ర్ తాను చూసాను అని, చాలా ఆస‌క్తికరంగా ఉంద‌ని రామ్ చ‌ర‌ణ్ పోస్ట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా తన స్నేహితులైన యూవీ క్రియేష‌న్స్ నిర్మాత‌ల‌కు, తన ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను అని రామ్ చ‌ర‌ణ్ తెలిపారు. 

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కించారు. సంతోష్ శోభన్, కావ్య తప్పర్ హీరో హీరోయిన్లు.