బ్లాక్ ఫంగస్..తూచ్..అలా కాదు

కరోనా వైరస్ భలే చిత్రమైనది. అలా అంటే అలా..ఇలా అంటే ఇలా…ఏదీ ఓ సిద్దాంతానికి కట్టుబడదు. ఇవ్వాళ ఓ థియరీ బయటకు వస్తే, రేపు లేదు ఎల్లుండి మరోటి వస్తుంది. పోనీ అదయినా, ఇదయినా…

కరోనా వైరస్ భలే చిత్రమైనది. అలా అంటే అలా..ఇలా అంటే ఇలా…ఏదీ ఓ సిద్దాంతానికి కట్టుబడదు. ఇవ్వాళ ఓ థియరీ బయటకు వస్తే, రేపు లేదు ఎల్లుండి మరోటి వస్తుంది. పోనీ అదయినా, ఇదయినా కాలానికి నిల్చుంటాయో అనుకుంటే, మర్నాడు మరో థియరీ బయటకు వస్తుంది. కరోనా వైరస్ కు అనుబంధంగా బయటకు వచ్చిన బ్లాక్ ఫంగస్ వ్యవహారం కూడా ఇలాగే వుంది.

నిన్నటి వరకు కరోనా వైరస్ ట్రీట్ మెంట్ లో స్టెరాయిడ్స్ ఎక్కువ వాడడం వల్ల, డయాబిటిక్ పేషెంట్లకు గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో లేకపోవడం వల్ల బ్లాక్ ఫంగస్ సోకుతోందని అన్నారు. అలాగే మాస్కులు మార్చుకుండా వాడడం కూడా ఓ పిల్ల రీజన్ అని కూడా అన్నారు.

కానీ ఈ రోజు మరో రీసెర్చి ఫలితాలు వచ్చాయి. ఇవి పూర్తిగా భిన్నంగా వున్నాయి. ఇండోర్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ జయదేవన్ 200 మంది బ్లాక్ ఫంగస్ పేషెంట్లపై పరిశోధన చేసారు. చిత్రంగా వీరిలో 42 మందికి డయాబెటీస్ లేదు. 28 మంది స్టెరాయిడ్స్ వాడలేదు. 72 మంది ఆక్సిజన్ తీసుకోలేదు. 110 మంది మాత్రమే ఆక్సిజన్ తీసుకున్నారు. 

గమ్మత్తేమిటంటే ఈ పేషెంట్లు అందరూ యాంటీ బయాటిక్స్ వాడిన వారే. అంటే ఇప్పుడు కొత్త అనుమానం ఏమిటంటే డయాబెటిక్స్, స్టెరాయిడ్స్, ఆక్సిజన్ వినియోగం కన్నా యాంటీ బయాటిక్స్ వినియోగం వల్ల బ్లాక్ ఫంగస్ సోకుతోందా అన్నది.

ఇవ్వాల్టికి ఇది, రేపో, ఎల్లుండో మరో పరిశోధన ఎవరో ఒకరు చేసారు. ఇంకో రకమైన రీజన్లు, లాజిక్ లు బయటకు వస్తాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో బయటకు వచ్చిన వైరస్ ల్లో కరోనా అంతటి కంగాళీ వైరస్ మరోటి లేదేమో?