రెండు రకాల మందులు కలిపితే కాక్ టెయిల్ అవుతుంది. అది ఏ మందు అయినా సరే, కరోనా కోసం కూడా ఓ ఇలా కాక్ టెయిల్ తయారు చేసారు. రెండు రకాల మందులు అంటే మెడిసిన్స్ కలిపి తయారుచేసిన ఈ కాక్ టెయిల్ ఇప్పుడు ఇండియాలోకి వచ్చేసింది దీని ఖరీదు అక్షరాలా 59,750 రూపాయలు మాత్రమే.
కాసిరివిమాట్, ఇమ్డివిమాబ్ అనే రెండురకాల మెడిసిన్ లు కలిపి ఈ కాక్ టెయిల్ ను తయారు చేసి దానికి యాంటీ బాడీ కాక్ టెయిల్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ కాక్ టెయిల్ ను ఇండియాలో సిప్లా, రోచ్ ఇండియా కంపెనీలు కలిపి అందిస్తున్నాయి. ఈ రోజు లక్ష ప్యాకట్లను మార్కెట్ లోకి విడుదల చేసారు. ఒక్కోప్యాకెట్ ఇద్దరు పేషెంట్లకు పనికి వస్తుంది. అంటే వీటితో రెండు లక్షల మంది పేషెంట్లను ట్రీట్ చేయవచ్చు అన్నమాట.
ఒక విధంగా మన శరీరంలో తయారుకావాల్సిన యాంటీ బాడీస్ ను బయట నుంచి అందించడం అన్నమాట. అవి మన శరీరంలోకి వెళ్లి కరొనా వైరస్ తో పోరాడతాయి. తక్కువ లేదా ఓ రేంజ్ వరకు లక్షణాలు వున్నవారికి ఈ మందు బాగా పని చేస్తుందని ప్రూవ్ అయింది. అందుకే భారత్ ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చారు. మొత్తానికి ఒక్కో మందు వస్తోంది.
వ్యాక్సీన్ వచ్చింది. మన ఆనందయ్య మందు వుండనే వుంది. ఇలా అన్ని వైపుల నుంచి భరోసా లభిస్తే కరోనా మహమ్మారి పీడ వదిలి మళ్లీ మనం రొటీన్ లైఫ్ లోకి వెళ్ల వచ్చేమో?