చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే రిజిస్టర్ చేయించారు. ఓ మంచి సందర్భం చూసి ఆ టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేయాలని భావించారు. కానీ చిరంజీవి ఆ టైటిల్ ను ముందే చేప్పేశారు. అదే ఆచార్య.
ఓ పిట్టకథ సినిమా ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన చిరంజీవి.. మాట్లాడుతూ మాటల సందర్భంలో తన సినిమా టైటిల్ ను బయటపెట్టేశారు. తన సినిమాకు ఆచార్య అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు. అయితే ఆ వెంటనే నాలుక కరుచుకున్నారు. తన సినిమా టైటిల్ ను తనే బయటపెట్టేశానని, ఈ విషయంలో కొరటాల శివకు సారీ చెబుతున్నట్టు ప్రకటించారు.
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఆచార్య అనే టైటిల్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. అదే టైటిల్ పెడతారని అంతా అనుకుంటున్నారు. అయితే కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫ్రెష్ గా మరో టైటిల్ రిజిస్టర్ చేయించి, ఆఖరి నిమిషంలో దాన్ని ప్రకటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్వయంగా చిరంజీవి తన సినిమా టైటిల్ ఏంటనేది బయటపెట్టడంతో మేటర్ క్లియర్ అయింది.
ఈ సందర్భంగా మరోసారి తన పాత వాగ్దానాన్ని గుర్తుచేసుకున్నారు చిరంజీవి. మూవీ మేకింగ్ ను వంద రోజుల్లోపే పూర్తిచేస్తే చాలా బాగుంటుందని, నిర్మాతతో పాటు ఇండస్ట్రీ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆచార్య షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.