కులాలు వద్దు.. మతాలు కావాలి…

జనాభా లెక్కల సేకరణ సమయంలో.. దేశంలోని వ్యక్తులకు సంబంధించి.. మొత్తం అన్ని రకాల వివరాలూ రికార్డుల్లోకి వచ్చేస్తాయని అందరూ అనుకుంటారు. మోడీ ప్రభుత్వం కొత్తగా కలుపుతున్న ప్రశ్నలతో పరిగణిస్తే.. డ్రైవింగ్ లైసెన్సు, తల్లిదండ్రుల పుట్టుక…

జనాభా లెక్కల సేకరణ సమయంలో.. దేశంలోని వ్యక్తులకు సంబంధించి.. మొత్తం అన్ని రకాల వివరాలూ రికార్డుల్లోకి వచ్చేస్తాయని అందరూ అనుకుంటారు. మోడీ ప్రభుత్వం కొత్తగా కలుపుతున్న ప్రశ్నలతో పరిగణిస్తే.. డ్రైవింగ్ లైసెన్సు, తల్లిదండ్రుల పుట్టుక వివరాలు, ఇంట్లో ఎందరు ఏ భాష మాట్లాడుతారనే వివరాలతో సహా సమస్తం రికార్డుల్లోకి వస్తాయి. ఇన్ని వివరాలు నమోదు అవుతున్నా దేశంలోని ప్రజల కులాల వివరాలు లెక్కతేల్చడానికి మాత్రం సర్కారు విముఖంగా ఉంది.

కులాల లెక్క తేల్చకపోవడానికి.. కుల పట్టింపులు లేని వారి విముఖత కారణం అనుకోవచ్చు. కానీ, అదే సమయంలో మతాల లెక్క తేల్చడానికి మాత్రం కేంద్రం ఉత్సాహపడుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోను అనేకానేక సంక్షేమ పథకాలు కులాలతో ముడిపడి ఉంటున్న నేపథ్యంలో కులాల లెక్క కూడా తేల్చాలంటున్న అనేక రాష్ట్రాల విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోవడం లేదు. వాటిని బేఖాతరు చేస్తోంది. కేవలం ఎస్సీ ఎస్టీలను మాత్రం లెక్క తేల్చే కసరత్తు జరుగుతుంది.

వచ్చే నెలలో ప్రారంభం కానున్న జనాభా లెక్కల సేకరణకు సంబంధించి.. రోజుకో వివాదం బయటకు వస్తోంది. సాధారణంగా ఈ జనగణన జరిగేప్పుడు ఏయే ప్రశ్నలుంటాయో.. వాటికి అదనంగా మోడీ సర్కారు ఏ ప్రశ్నలు చేర్చబోతున్నదనే దాని మీదనే చర్చోపచర్చలు జరిగాయి. కుటుంబయజమాని తండ్రుల పుట్టుక గురించిచన వివరాలు కూడా అడగబోతున్నారనే సంగతి వివాదం రేగింది. తల్లిదండ్రులు పుట్టిన ఊరు, పుట్టిన తేదీ కూడా ప్రశ్నలుగా మారాయి.

తాజాగా మరో వివాదం బయటకు వచ్చింది. అనేక రాష్ట్రాలు కులగణన కూడా ఉండాలని కోరుతున్నప్పటికీ.. కేంద్రం ఆ మాటల్ని పట్టించుకోవడం లేదు. మహారాష్ట్ర బీహార్ లు ఇదివరకే ఈమేరకు కులగణన కూడా ఉండాలని కోరుతూ శాసనసభల్లో తీర్మానం చేశాయి. ఒదిశాలోని బిజద పార్లమెంటులోనే ఈ డిమాండు వినిపించింది. అయితే కులాల లెక్కతేల్చడం జనగణన మౌలిక స్ఫూర్తికే విరుద్ధం అంటూ కేంద్రం వాటిని తిరస్కరిస్తోంది.

జనగణనకు సంబంధించి కులాల వివరాలు సేకరించాలని రాజ్యాంగంలో లేదన్నది వారి వాదన. రాజ్యాంగంలో కేవలం ఎస్సీ ఎస్టీల లెక్క తేల్చాలని మాత్రమే ఉండగా… కేంద్రం మతాల వారీ వివరాలను కూడా సేకరిస్తోంది. కులాల విషయంలో చాలా సంక్లిష్టత ఉంటుందని వాదిస్తున్నారు. కులాల పేర్లలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఉంటుందని.. పలికే తీరులో తేడా ఉంటుందని ఇలా రకరకాల కారణాలు చెబుతున్నారు.

అసలే మోడీ సర్కారు అనేక చట్టాల రూపంలో మతాల పరమైన వివక్షను చూపుతున్నదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. జనగణనకు కులాలను పట్టించుకోకుండా, మతాల వివరాలను మాత్రం నమోదు చేయడానికి పూనుకోవడం కొత్త వివాదంగా రూపొందనుంది.

ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే వ్య‌క్తి చిరంజీవి