చిరంజీవి సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, ఆయన సినిమాల్లో డాన్స్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. ఇప్పుడు మరోసారి అలాంటి డాన్సింగ్ ఫీస్ట్ అందించడానికి రెడీ అవుతున్నారు చిరు.
భోళాశంకర్ సినిమా నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ వచ్చేసింది. “భోళా మేనియా త్వరలోనే ప్రారంభం” అంటూ లిరికల్ వీడియోస్ విడుదలను గ్రాండ్ గా ప్రకటించారు మేకర్స్.
ఆగస్ట్ 11న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అంటే, ప్రమోషన్ కు ఇంకా 2 నెలలు టైమ్ ఉందన్నమాట. ఈ క్రమంలో ముందుగా సాంగ్స్ రిలీజ్ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఫస్ట్ సాంగ్ లోనే చిరు మాస్ లుక్ తో పాటు, స్టెప్స్ ను చూపించబోతున్నారు. ఈ మేరకు జాతర/ఉత్సవం బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి స్టయిల్ గా నిల్చున్న ఫొటోను రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో పక్కా మాస్ రోల్ పోషించారు చిరంజీవి. సో.. సాంగ్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయంటున్నారు. భోళాశంకర్ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. తాజాగా చిరంజీవి-తమన్న తో స్విట్జర్లాండ్ లో ఓ సాంగ్ షూట్ కూడా పూర్తిచేశారు.
మెహర్ రమేష్ డైరక్ట్ చేస్తున్న ఈ రీమేక్ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తోంది. లవర్ బాయ్ పాత్రలో సుశాంత్ కనిపించనున్నాడు.