cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

అల్లుడి కోసం తెగ కష్టపడుతున్న చిరంజీవి

అల్లుడి కోసం తెగ కష్టపడుతున్న చిరంజీవి

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు చిరంజీవి. దీంతో పాటు లూసిఫర్ రీమేక్ పై కూడా కసరత్తు చేస్తున్నట్టున్నారు. అయితే ఈ సినిమాలతో పాటు ఆయన పైకి కనిపించని మరో సినిమా కూడా చేస్తున్నారు. అదే సూపర్ మచ్చి. అవును.. చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న ఈ సినిమా కోసం చిరంజీవి చాలా కష్టపడుతున్నారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి పనిని తనే దగ్గరుండి చూసుకుంటున్నారు.ట

విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు కల్యాణ్ దేవ్. మామ టైటిల్ తో హిట్ కొడదామనుకున్న అతడి ఆశలకు గండిపడింది. దీంతో అల్లుడికి బ్రేక్ ఇచ్చారు చిరంజీవి. చాలా కథలు విన్న తర్వాత సూపర్ మచ్చి అనే కథను ఓకే చేశారు. కాస్త మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ కథ అయితే బాగుంది కానీ దాని మేకింగ్ మాత్రం మరీ నాసిరకంగా తయారైంది.

నిర్మాత రిజ్వాన్ కు డబ్బులు పెట్టడం మాత్రమే తెలుసు. ఇక దర్శకుడు పులివాసు తీసిందే ఫైనల్ అన్నట్టు తయారైంది. ఆఖరి నిమిషంలో రంగంలోకి దిగిన చిరంజీవి పులివాసు తీసిన రషెస్ మొత్తం పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. తన తరఫును ఓ ఇద్దరు వ్యక్తులను ప్రొడక్షన్ లో పెట్టడంతో పాటు.. డైలాగ్స్ ను రిఫైన్ చేసేందుకు పరుచూరి బ్రదర్స్ ను రంగంలోకి దించారు.

అలా సూపర్ మచ్చి సినిమాను అన్నీతానై తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రొడ్యూసర్ రిజ్వాన్ కు తడిసి మోపెడైనప్పటికీ.. చిరంజీవి ఏదో హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అవుట్ పుట్ బాగా వచ్చిన తర్వాత దీన్ని దిల్ రాజు చేతిలో పెట్టాలనేది చిరు ఆలోచన.