చిరంజీవి హెల్త్ ఇన్స్యూరెన్స్

ప్రజా ప్రభుత్వాలు ప్రజలకు ఏదో విధంగా బెనిఫిట్ లు ఇచ్చి ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. వీటిల్లో కొన్ని వృధాగా పోయేవి వుంటున్నాయి. కొన్ని మంచివి వుంటున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం అలాంటి ఓ మంచి పథకాన్ని ప్రవేశపెట్టి…

ప్రజా ప్రభుత్వాలు ప్రజలకు ఏదో విధంగా బెనిఫిట్ లు ఇచ్చి ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. వీటిల్లో కొన్ని వృధాగా పోయేవి వుంటున్నాయి. కొన్ని మంచివి వుంటున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం అలాంటి ఓ మంచి పథకాన్ని ప్రవేశపెట్టి దేశం మొత్తాన్ని తమ రాష్ట్రం వైపు చూసేలా చేసింది. ఆ పథకం పేరే చిరంజీవి హెల్త్ ఇన్స్యూరెన్స్. 

సాధారణంగా ప్రభుత్వాలు ఆరోగ్య శ్రీ లాంటి పథకాలు ప్రవేశ పెట్టి ఆసుపత్రులకు తిరిగి ఖర్చు చెల్లిస్తుంటాయి. పైగా ఇవి కొందరికే వర్తిస్తాయి, కానీ రాజస్థాన్ ప్రభుత్వం ఈ బాదరబందీ వ్యవహారం లేకుండా జనాలు అందరికీ హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీము ఇచ్చేస్తోంది. ఎవరైనా హెల్త్ ఇన్స్యూరెన్స్ చేసుకోవాలంటే కొంత మొత్తం చెల్లించాలి. ఆ మొత్తం అంతా ఇప్పుడు ప్రభుత్వమే కట్టేస్తుందన్నమాట. 

ఇకపై ప్రభుత్వానికి పని సులువు. ఆసుపత్రులు, భీమా కంపెనీలు మిగిలిన వ్యవహారం చూసుకుంటాయి. రూపాయి చెల్లించకుండా అయిదు లక్షల వరకు భీమా జనాలకు లభిస్తుంది. ఇక ఇందులో దుర్వినియోగానికి అవకాశం తక్కువ వుంటుంది. 

ఎందుకంటే భీమా సంస్థలు చాలా గట్టిగా నిఘా వేసి వుంటాయి కాబట్టి. ప్రస్తుతానికి వినవస్తున్న వార్తల ప్రకారం ఈ స్కీము మొత్తం ప్రజలకు అమలు చేస్తారు. అది మంచి విషయం. కేవలం తెల్లకార్డుల వారికే అంటే మధ్యతరగతి వారికి అస్సలు ప్రయోజనం వుండదు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది అదే.