Advertisement

Advertisement


Home > Movies - Movie News

సంక్రాంతికి చిరంజీవి సినిమా

సంక్రాంతికి చిరంజీవి సినిమా

చిరంజీవి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలొస్తున్నాయి. కానీ సంక్రాంతికి మెగా సినిమా వచ్చి చాన్నాళ్లయింది. ఇప్పుడా మెగా సందర్భం రానే వచ్చింది. చిరంజీవి సినిమా సంక్రాంతికి లాక్ అయింది. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఆ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

"కలుద్దాం సంక్రాంతికి" అనే క్యాప్షన్ తో జనవరి 2023 అనే ట్యాగ్ లైన్ తో మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. కానీ ఇలా ముందుగానే సంక్రాంతి ని రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. శృతిహాసన్ ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా నిర్ణయంతో.. చిరంజీవి నుంచి 2 సినిమాలు 3 నెలల గ్యాప్ లో ఫిక్స్ అయ్యాయి. ఆయన నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుంది. అది థియేటర్లలోకి వచ్చిన 3 నెలలకే బాబి దర్శకత్వంలో చేస్తున్న సినిమా రాబోతోందన్నమాట. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అనుకుంటున్నారు. కానీ మేకర్స్ ఇంకా నిర్థారించలేదు.

ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న స్ట్రయిట్ మూవీ ఇదే. ఆయన చేతిలో ఉన్న గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు రెండూ రీమేక్ ప్రాజెక్టులే. చిరు-బాబి సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కెరీర్ లో చిరంజీవికి ఇది 154వ చిత్రం.

చిరంజీవి సినిమా ప్రకటనతో సంక్రాంతి పోటీని అధికారికంగా ప్రకటించినట్టయింది. జస్ట్ కొన్ని రోజుల కిందటే వైష్ణవ్ తేజ్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతకంటే ముందు విజయ్-వంశీపైడిపల్లి కాంబోలో వస్తున్న వారసుడు సినిమాను కూడా సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని సినిమాలు సంక్రాంతి బరిలో చేరుతాయో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?