మెగామూవీ కి డైరక్టర్ కావాలి!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా విశ్వంభర. దాని తరువాత చేయాల్సిన సినిమాకు కథ రెడీగా వుంది. నిర్మాత రెడీగా వున్నారు. కానీ దర్శకుడే సెట్ కావడం లేదు. ఇది చిరకాలంగా నలుగుతూ వస్తోంది.…

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా విశ్వంభర. దాని తరువాత చేయాల్సిన సినిమాకు కథ రెడీగా వుంది. నిర్మాత రెడీగా వున్నారు. కానీ దర్శకుడే సెట్ కావడం లేదు. ఇది చిరకాలంగా నలుగుతూ వస్తోంది.

ఇప్పటి వరకు చాలా పేర్లు తెర మీదకు వచ్చాయి. కళ్యాణ్ కృష్ణ నుంచి మొదలైంది జాబితా. లాస్ట్ కు మోహన్ రాజా పేరు ఫైనల్ అయిందని వార్తలు వినిపించాయి. ఈ మేరకు కథకుడు బివిఎస్ రవి అందించిన కథను పట్టుకుని స్క్రిప్ట్ తయారుచేసే పని కూడా మొదలైందని వార్తలు వచ్చాయి. గతంలో లూసిఫర్ రీమేక్ ను మోహన్ రాజా సమర్ధవంతంగా హ్యాండిల్ చేసారు. అందువల్ల మోహన్ రాజా ఫైనల్ అనే అనుకున్నారంతా.

కానీ లేటెస్ట్ సమాచారం ఏమిటంటే ఇప్పుడు మోహన్ రాజా చేయడం లేదు. వేరే దర్శకుడి కోసం చూస్తున్నారు. రెండు మూడు పేర్లు పరిశీలనలో వున్నాయి. వీరిలో గతంలో ప్రభాస్ తో పని చేసిన ఓ దర్శకుడి పేరు కూడా పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది.

బివిఎస్ రవి అందించిన కథ ఏ జానర్ అన్నది తెలియదు. మరి ఎందుకు దర్శ‌కుడు సెట్ కావడం లేదన్నది తెలియదు. ఈ కథ కాస్త భారీ కథ అనే తెలుస్తోంది. అందువల్ల ఈ రేంజ్ కథను హ్యాండిల్ చేసే దర్శకుడి కోసం చూస్తున్నట్లు కనిపిస్తోంది. తిరిగి తిరిగి మళ్లీ కళ్యాణ్ కృష్ణ దగ్గరకే వస్తుందేమో? కళ్యాణ్ కృష్ణ నాగ్ తో చేసిన సినిమాలు అన్నీ హిట్ లే.

సీనియర్ హీరోల కథలను బాగానే హ్యాండిల్ చేస్తారు కనుక మెగాస్టార్ కూడా కళ్యాణ్ కే చాన్స్ ఇస్తే బెటరేమో?

7 Replies to “మెగామూవీ కి డైరక్టర్ కావాలి!”

  1. మోసగాని ..అడగండి ఎప్పడు 2024 మేనిఫెస్ట్ అమలు చేసినాడు అని

    TDP 2024 మెనెఫెస్టో

    మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

Comments are closed.