కుదిరితే కాజల్… కుదరకపోతే తమన్న

వయసు పైబడిన హీరోలందరికీ హీరోయిన్ సమస్య ఉంది. వీళ్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్లాన్ చేస్తుంటారు. కానీ సినిమాకో హీరోయిన్ మాత్రం వీళ్లకు దొరకదు. ఉన్న ఒకరిద్దరితో సర్దుకుపోవాల్సిందే. ప్రస్తుతం చిరంజీవి అదే…

వయసు పైబడిన హీరోలందరికీ హీరోయిన్ సమస్య ఉంది. వీళ్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్లాన్ చేస్తుంటారు. కానీ సినిమాకో హీరోయిన్ మాత్రం వీళ్లకు దొరకదు. ఉన్న ఒకరిద్దరితో సర్దుకుపోవాల్సిందే. ప్రస్తుతం చిరంజీవి అదే పని చేస్తున్నారు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ఈ సీనియర్ హీరో, మినిమం గ్యాప్స్ లో హీరోయిన్లను రిపీట్ చేస్తున్నారు.

ఖైదీ నంబర్ 150లో కాజల్ తో నటించిన చిరంజీవి.. తాజాగా ఆచార్య సినిమాతో మరోసారి ఆమెను రిపీట్ చేశారు. ఈ రెండు సినిమాల మధ్యలో చేసిన సైరాలో తమన్నకు సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం ఆమెను మరోసారి రిపీట్ చేయబోతున్నారు. కాకపోతే మెయిన్
హీరోయిన్ గా.

మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా ప్రకటించారు చిరంజీవి. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తిసురేష్ కనిపించబోతోంది. ఇక చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నను తీసుకున్నారు. తమన్నతో కలిసి స్టెప్స్ వేయడం తనకు ఎంతో ఆనందమని గతంలో ప్రకటించిన చిరంజీవి, సైరాలో ఆ కోరిక  తీర్చుకోలేకపోయారు. ఎట్టకేలకు భోళాశంకర్ తో చిరు కోరిక తీరబోతోంది.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతోంది భోళాశంకర్. సినిమా అయితే ఎనౌన్స్ చేశారు కానీ, ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో అప్పుడే చెప్పలేం. ఎందుకంటే, ప్రస్తుతం చిరంజీవి, గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నారు.