పవన్ ను పోటు పొడిచినట్టు ఫీల్ అయ్యా – చిరంజీవి

వాల్తేరు వీరయ్య సినిమాలో ఓ సీన్. రవితేజ చనిపోయే స్టేజ్ లో ఉంటాడు. చిరంజీవి, తన తమ్ముడ్ని బతికించుకోవడానికి ప్రయత్నిస్తారు. హాస్పిటల్ కు తీసుకెళ్లాలని అనుకుంటారు. ఆ సన్నివేశంలో చిరంజీవి నటనకు అంతా ఫిదా…

వాల్తేరు వీరయ్య సినిమాలో ఓ సీన్. రవితేజ చనిపోయే స్టేజ్ లో ఉంటాడు. చిరంజీవి, తన తమ్ముడ్ని బతికించుకోవడానికి ప్రయత్నిస్తారు. హాస్పిటల్ కు తీసుకెళ్లాలని అనుకుంటారు. ఆ సన్నివేశంలో చిరంజీవి నటనకు అంతా ఫిదా అయ్యారు. చిరు తన అనుభవంతో చాలా బాగా చేశారని మెచ్చుకున్నారు.

ఆ సీన్ వెనక జరిగిన హోం వర్క్ ను తాజాగా చిరంజీవి బయటపెట్టారు. ఆ సన్నివేశంలో రవితేజ స్థానంలో తన సొంత తమ్ముడు పవన్ కల్యాణ్ ను ఊహించుకున్నారట చిరు. అందుకే ఆ సీన్ అంత బాగా వచ్చిందన్నారు.

“సినిమాలో నా తమ్ముడి పాత్ర పోషించాడు రవితేజ. సినిమాలో అతడ్ని వెనక నుంచి పొడుస్తారు. ఆ టైమ్ లో నాకు పవన్ కల్యాణ్ గుర్తొచ్చాడు. ఆ సీన్ లో నేను నా తమ్ముడు పవన్ ను తలుచుకొని చేశాను, రవితేజ మీద ఆ ఫీలింగ్ ను బయటపెట్టాను. అందుకే ఆ సీన్ నేను కావాలని ఏదో చేసినట్టు అనిపించదు. పవన్ ను తలుచుకోవడం వల్ల ఆటోమేటిగ్గా ఆ బాధ, ఆర్థ్రత, కంగారు వచ్చేశాయి. అందుకే ఆ సీన్ అంత బాగా పండింది.”

హీరోలుగా ఎదుగుతున్న టైమ్ లో రవితేజ, పవన్ కల్యాణ్ ఇద్దరూ తనకు ఒకేలా కనిపించేవారని, అప్పట్నుంచే రవితేజపై తనకు సోదరభావం ఉందని చెప్పుకొచ్చారు చిరు.