Advertisement

Advertisement


Home > Movies - Movie News

అబ్బా.. చిరంజీవి భలే ఐడియా ఇచ్చారే..!

అబ్బా.. చిరంజీవి భలే ఐడియా ఇచ్చారే..!

నితిన్, రష్మిక, వెంకీ కుడుముల మళ్లీ కలిశారు. భీష్మ తర్వాత మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. చీఫ్ గెస్ట్ గా చిరంజీవి హాజరయ్యారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు చిరంజీవి క్లాప్ కొట్టారు. హీరోహీరోయిన్లకు, నిర్మాతలు-దర్శకుడికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పనిలోపనిగా సినిమాకు ఏ టైటిల్ పెడితే బాగుంటుందో కూడా సూచించి, అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.

ఈ సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడు #VNRTro అనే హ్యాష్ ట్యాగ్ పెట్టారు. వెంకీ కుడుముల, నితిన్, రష్మిక కలిసి మరోసారి సినిమా చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు దీన్నే టైటిల్ గా ఎందుకు పెట్టకూడదంటూ చిరంజీవి సలహా ఇచ్చారు.

ఆర్ఆర్ఆర్ స్ఫూర్తితో..

చరణ్, తారక్ హీరోలుగా రాజమౌళి సినిమా ఎనౌన్స్ చేసినప్పుడు ఇలానే ఆర్ఆర్ఆర్ అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. రామ్ చరణ్, రామారావు, రాజమౌళి అనే అర్థం వచ్చేలా క్రియేట్ అయిన ఈ హ్యాష్ ట్యాగ్, ఆ తర్వాత మరింత పాపులర్ అయింది. దీంతో దాన్నే టైటిల్ గా పెట్టేశారు.

ఇప్పుడు అదే స్ఫూర్తితో నితిన్ కొత్త సినిమాకు వీఎన్ఆర్ అనే టైటిల్ పెట్టేయొచ్చంటూ చిరంజీవి చెప్పడం అక్కడున్న అందరికీ ఎంతగానో ఆకర్షించింది. నిజమే.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనుకుంటున్న ఈ సినిమాకు ఏదో తెలుగు టైటిల్ పెట్టేబదులు.. ఇలా వీఎన్ఆర్ అనే హ్యాష్ ట్యాగ్ నే పాపులర్ చేస్తే ఓ పనైపోతుంది కదా.

మొత్తానికి ఈ సినిమాకు ముఖ్య అతిథిగా రావడంతో పాటు.. టైటిల్ ను కూడా సజెస్ట్ చేశారు చిరంజీవి. ఇదంతా ఓకే కానీ, రష్మిక మందన్న పేరును ఆయన ఎలా సంభోదించారనేది మాత్రం తెలియలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?