Advertisement

Advertisement


Home > Movies - Movie News

వీరమల్లు వెనక్కు.. పవన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఇదే

వీరమల్లు వెనక్కు.. పవన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఇదే

లెక్కప్రకారం.. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ముందుగా పూర్తవ్వాలి. ఆ సినిమానే ముందుగా రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఆర్డర్ మారింది. వినోదాయ శితం రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతేకాదు, ఈ సినిమానే ముందుగా రిలీజ్ అవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

సముద్రఖని దర్శకత్వంలో పవన్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతోంది వినోదాయ శితం రీమేక్. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది పీపుల్ మీడియా సంస్థ. ఈ ఏడాది జులై 28న పవన్-సాయిధరమ్ తేజ్ ల సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

మరింత వెనక్కు వీరమల్లు..

నిజానికి వీరమల్లు సినిమాను ఈ సమ్మర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు. అది కుదరలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల మధ్య దసరాకు రెడీ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఆ డిస్కషన్ కూడా జరగడం లేదు. ఈ సినిమా దసరాకు రిలీజ్ అవుతుందా అవ్వదా అనే విషయాన్ని పక్కనపెడితే, వీరమల్లు కంటే ముందే వినోదాయ శితం రీమేక్ థియేటర్లలోకి రాబోతోందనేది ఫిక్స్.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు చాలా తక్కువ కాల్షీట్లు ఇచ్చి, ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నాడు పవన్ కల్యాణ్. వెంటనే సెట్స్ పైకి కూడా రావడం, రీమేక్ కావడం వల్ల షూటింగ్ చకచకా పూర్తయిపోతోంది.

జీ స్టుడియోస్ సంస్థ ఈ సినిమాకు సహ-నిర్మాతగా వ్యవహరిస్తోంది. నాన్-థియేట్రికల్ రైట్స్ అన్నింటినీ ఆ సంస్థ దక్కించుకోవడంతో పాటు.. పీపుల్ మీడియాతో కలిసి థియేట్రికల్ రిలీజ్ కూడా చేస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?