Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie News

కల్కి విడుదల తేదీ వస్తోంది

కల్కి విడుదల తేదీ వస్తోంది

నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబినేషన్ కల్కి సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదల డేట్ ను ఇవాళ‌ ప్రకటించబోతున్నారు. ఆ డేట్ ఏమై వుంటుందా అన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో బలంగా వుంది.

మే 9న అన్నది ఇంతకు ముందు ప్రకటించిన విడుదల తేదీ. కానీ ఎన్నికల కారణంగానూ, కొన్ని సిజి పనుల కారణంగానూ వాయిదా వేయక తప్పలేదు. సిజి వర్క్స్ అన్నీ మే నెలాఖరుకే వచ్చేస్తాయని తెలుస్తోంది. కానీ సినిమా విడుదలకు కావాల్సిన టికెట్ రేట్లు కావాలంటే ఆంధ్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరితే పని సులువు అవుతుంది. ఎన్నికల కోడ్ వుండగా లాస్ట్ మినిట్ లో సమస్య అయితే అది ఇబ్బందికి దారితీస్తుంది.

అందువల్ల జూన్ లేదా జూలైలో విడుదల చేయాలని లెక్కలు కట్టినట్లు తెలుస్తోంది. జూన్ లో ఇండియన్ 2 సినిమా కూడా వుంది. అందువల్ల జూన్ నెలాఖరున లేదా జూలై లో విడుదల చేస్తే బెటర్ అనే ఆలోచనకు వచ్చారు. కానీ ఆ రెండింటిలో ఏది ఫిక్స్ అవుతుందన్నది రేపు సాయంత్రం తెలుస్తుంది.

జూన్ 27 ఒక మంచి డేట్. కానీ గురువారం. లేదా జూలై 11 కు వెళ్లిపోవాలి. అందువల్ల మరీ ఆలస్యం అయిపోతుంది. అందువల్ల జూన్ 27 కు ఫిక్స్ అవుతారనే లెక్కలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో కీలక క్రికెట్ మ్యాచ్ వుందనే మాట వినిపిస్తోంది. పైగా ఆది పురుష్ విడుదలయింది అదే నెలలో. అదో సెంటిమెంట్ కూడా.

మొత్తం మీద ఈ రెండు తేదీల్లో ఏదో ఒక దానిని కల్కి యూనిట్ ఇవాళ‌ ప్రకటిస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?