సినిమా అంటే గ్లామర్ రంగం. ఈ రంగంలో పురుషాధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళా నిర్మాతలు మచ్చుకు కూడా లేదు. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దల పిల్లలు నిర్మాణ రంగంలోకి వస్తున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ కూతురు మంజుల, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ వారసులుగా ఆయన ఇద్దరు కూతుళ్లు ప్రియాంకా దత్, స్వప్న దత్ వచ్చారు. రావడం రావడంతోనే ‘మహానటి’ అనే గొప్ప చిత్రాన్ని నిర్మించారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థను రెండు రోజుల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. తన తొలి ప్రాజెక్ట్‌గా వెబ్ సిరీస్‌ను టేకప్ చేసింది. ఇందులో భాగంగా ఎక్స్ ఛేంజ్ ఆఫ్ ఫైర్ టైటిల్ తో ఆనంద్ రంగా దర్శకత్వంలో వెబ్ సిరీస్‌కు శ్రీకారం చుట్టారు. 2009లో విడుదలైన ‘ఓయ్’ సినిమాకు ఆనంద్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
సుదీర్ఘ గ్యాప్ తర్వాత వెబ్‌సిరీస్‌కు దర్శకత్వ అవకాశాన్ని సుస్మిత ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ వెబ్‌సిరీస్‌లో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రధాన పాత్రలో నటించనున్నారు. పోలీస్ పాత్ర అంటే సహజంగా హీరో సాయికుమార్ గుర్తుకొస్తాడు. ఆయన గంభీరమైన డైలాగ్స్ డెలవరీ, హావభావాలు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాయి.
ప్రకాశ్‌రాజ్ అంటే ఏ పాత్రలోనైనా ఇమిడిపోగల విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. అలాంటి విలక్షణ నటుడిని ఎంచుకోవడం సుస్మిత సృజనాత్మక ఆలోచనకు ప్రతీక. మరో నటుడు సంపత్‌రాజ్ ముఖ్య పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఈ వెబ్ సిరీస్ జీ5 యాప్‌లో ప్రసారం కానుంది. సుస్మిత మొదటి వెబ్ సిరీస్‌కు సంబంధించి ప్రస్తుతానికి వివరాలివీ.