మెగాస్టార్ చిరంజీవి. ఆంధ్ర సిఎమ్ జగన్ మోహన్ రెడ్డిల భేటీ జరిగింది. డిసెంబర్ ఆఖరి వారంలో జరగాల్సిన భేటీ ఇప్పటికి సాధ్యమైంది. వైఎస్ జగన్ క్రిస్మస్ కు ఇడుపులపాయకు వెళ్లి వచ్చాక ఈ భేటీ జరగాల్సింది.
అనేక కారణాల వల్లదూరం జరుగుతూ వచ్చింది. ఆఖరికి ఇప్పటికి సాధ్యమైంది. కానీ ఇదేదో అకస్మాత్తుగా జరిగిందని ఓ వర్గం మీడియా అనుకుంటోంది. కానీ వాస్తవం ఏమిటన్నది చిరంజీవికి తెలుసు. ఎందుకంటే ఆయన డిసెంబర్ మూడొ వారం నుంచి ఈ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి విందును మెగాస్టార్ కోసం ఏర్పాటుచేసారు. ఈ విందులో మటన్ బిరియానీ వడ్డించినట్లు తెలుస్తోంది. ఇద్దరి నడుమ సినిమా ఇండస్ట్రీ సమస్యల మీద సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. టికెట్ రేట్ల విషయంలో ఎక్కువగా మార్చడం సాధ్యం కాదని, వీలయినంత మార్చడానికి ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఫ్రెష్ గా కొత్త వినతిపత్రం మాదిరిగా ఓ లేఖను పంపించమని మెగాస్టార్ ను కోరినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఆయన త్వరలో పంపిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అది అందిన తరువాత, ఇప్పటికే నియమించిన కమిటీ నివేదిక అందిన తరువాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని సిఎమ్ చెప్పినట్లు తెలుస్తోంది.