చిరు…ఇదేం లుక్కు మెగాస్టారూ?

కాలం మారుతోంది. కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి. హీరోలు వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మన సీనియర్ హీరోలు మాత్రం మారడం లేదు.  Advertisement లూసిఫర్ అనే సినిమాను తెలుగు జనాలు దాదాపుగా అందరూ…

కాలం మారుతోంది. కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి. హీరోలు వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మన సీనియర్ హీరోలు మాత్రం మారడం లేదు. 

లూసిఫర్ అనే సినిమాను తెలుగు జనాలు దాదాపుగా అందరూ ఓటిటి ప్లాట్ ఫారమ్ మీద చూసేసారు. మలయాళ హీరో మోహన్ లాల్ ను చూసిన కళ్లతో ఇప్పుడు మెగాస్టార్ లుక్ ను చూడాలంటే ఏదోగా వుంది.

టీజర్ ప్రకటనతో పాటు ఓ పోస్టర్ వదిలారు. అది చూస్తే అయ్యో అంటున్నారు సినిమా అభిమానులు. మోహన్ లాల్ చేసిన లూసిఫర్ ను రీమేక్ చేయడమే తప్పు. ఎందుకంటే మన మెగాస్టార్ లు, సీనియర్ స్టార్లు ఆ సినిమాను ఉన్నది ఉన్నట్లుగా తీయలేరు. మనకు పాటలు కావాలి, డ్యాన్స్ లు కావాలి. ఆ మేరకు మార్చేసుకుంటారు.

సరే, మార్చుకుంటే మార్చుకున్నారు అనుకుంటే ఇప్పుడు చిరు గెటప్ కూడా నిరాశజనకంగా వుంది. ఆ కళ్లజోడుతో చిరు ను చూసి మెగాభిమానులు కూడా నిట్టూరుస్తున్నారు. ఇక సినిమా వస్తే ఎలా వుంటుందో చూడాలి.