ఇదే నా చివ‌రి వీడియో…న‌టి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

సోష‌ల్ మీడియా వేధింపులు ఓ త‌మిళ న‌టి ప్రాణం మీద‌కి తెచ్చాయి. అదృష్ట‌వ‌శాత్తు ఆ న‌టి బ‌తికి బ‌య‌ట ప‌డింది. ఆ బాధితురాలు త‌మిళ‌న‌టి విజ‌య‌ల‌క్ష్మి. సోష‌ల్ మీడియా వేధింపులు, బెదిరింపుల కాణంగా జీవితంపై…

సోష‌ల్ మీడియా వేధింపులు ఓ త‌మిళ న‌టి ప్రాణం మీద‌కి తెచ్చాయి. అదృష్ట‌వ‌శాత్తు ఆ న‌టి బ‌తికి బ‌య‌ట ప‌డింది. ఆ బాధితురాలు త‌మిళ‌న‌టి విజ‌య‌ల‌క్ష్మి. సోష‌ల్ మీడియా వేధింపులు, బెదిరింపుల కాణంగా జీవితంపై విర‌క్తి చెందాన‌ని, దీంతో ప్రాణం తీసుకుంటున్న‌ట్టు సెల్పీ వీడియోలో త‌న గోడు వెల్ల‌బోసుకున్నారామె.

‘నామ్ తమిళర్’ పార్టీ నేత సీమన్, ‘పన‌న్‌కట్టు పడై’కి చెందిన హరి నాడార్ ఫాలోవర్లు తనను వేధిస్తున్నట్టు సోష‌ల్ మీడియా వేధిక‌గా ఆమె ప‌లు వీడియోలు విడుద‌ల చేశారు.  ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ వీడియో పోస్టులో కొన్ని పిల్స్ తీసుకుంటే రక్తపోటు తగ్గిపోయి మరణం సంభవిస్తుందని చెప్పి క‌ల‌క‌లం రేపారు.

ముఖ్యంగా సీమన్, హరి నాడార్ ఫాలోవర్ల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఆ వీడియోలో చెప్పారు.  ఫేస్‌బుక్‌లో ఆమె పోస్టు చేసిన వీడియోలో ‘ఇది నా చివరి వీడియో. సీమన్, అతడి పార్టీ కార్యకర్తలు నాలుగు నెల‌లుగా వేధిస్తున్నారు. దీంతో  నేను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాను. వాళ్ల దుర్మార్గాల నుంచి నాతో పాటు నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించా. మీడియాలో నన్ను హరి నాడార్ అవమానించారు. నేను బీపీ మాత్రలు తీసుకున్నా. మరి కాసేపట్లో నా బీపీ పడిపోతుంది. ఆ తర్వాత చనిపోతా’ అని మ‌ర‌ణ వాంగ్మూలం ఇచ్చిన‌ట్టుగా పేర్కొన్నారు.  

విజ‌య‌ల‌క్ష్మి వీడియో చూసిన నెటిజ‌న్లు, ఆమె అభిమానులు ఆందోళ‌న చెందారు. దీంతో ఆమెని త‌క్ష‌ణం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆమె కోలుకుంటున్నార‌ని తెలిసింది. విజ‌య‌ల‌క్ష్మి ఆరోపిస్తున్న తమిళ జాతీయ పార్టీ  ‘నామ్ తమిలార్ కచ్చి’ ,‘పనన్‌కట్టు పాడై’  తమిళనాడు, పుదుచ్చేరిలో మ‌నుగ‌డ‌లో ఉన్నాయి.  

కాపీ పేస్టులు చేసేవాళ్ళు కూడా రివ్యూ రైటర్లు అయిపోయారు