సినిమా తరువాత..అడ్వాన్స్ ముందు

మన నిర్మాతలు ఫుల్ జోష్ మీద వున్నారు. వాళ్లు జోష్ కి మన హీరోలు సరిపోవడం లేదు. అందుకే పక్క భాష హీరోల వైపు చూస్తున్నారు. ఇది చూసి వాళ్లు, ఈ మోజును క్యాష్…

మన నిర్మాతలు ఫుల్ జోష్ మీద వున్నారు. వాళ్లు జోష్ కి మన హీరోలు సరిపోవడం లేదు. అందుకే పక్క భాష హీరోల వైపు చూస్తున్నారు. ఇది చూసి వాళ్లు, ఈ మోజును క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. కోట్లకు కోట్లు అడ్వాన్స్ లు అడిగి తీసుకుంటున్నారు. సినిమా సంగతి తరువాత, ముందుగా డబ్బులు చేతిలో పడిపోతున్నాయి కదా అని సంబరపడుతున్నట్లు కనిపిస్తోంది.

తమిళంలో ఓ సూపర్ స్టార్ వున్నారు. ఆయనతో సినిమా చేస్తే అద్భుతమైన డిమాండ్ అని ఏమీ లేదు కానీ, ఓ లెవెల్ స్టార్ తో సినిమా చేసామనే ఆనందం మిగులుతుంది. కానీ ఆయన తో సినిమా చేయాలి అంటే సదరు హీరో భార్య లేదా కూతురు ఎంట్రీ అయిపోతారట. 

సరే, అలాగే ముందుగా ఓ రెండు కోట్లు పంపడి..లేదా కోటి పంపండి అంటారట. అసలు సినిమా గురించి, కథ, డైరక్టర్ అన్న ఊసు ఎత్తకుండా, అడ్వాన్స్ ముందు పంపేయండి అనే సరికి మన నిర్మాతలకు ఎక్కడో డౌట్ కొట్టేసి ఆగిపోతున్నారు. అసలే మనవాళ్లు తెలివైన ముదుర్లు కదా.

మరో తమిళ హీరో వున్నారు. ఇది మరీ చిత్రం. ఇట్నుంచి కాకుండా అట్నుంచే ప్రతిపాదన వచ్చేస్తుంది. మనం ఓ సినిమా చేద్దాం అని సదరు హీరో వైపు నుంచే ప్రపోజల్ ముందుగా వస్తుంది. ఆ తరువాత ఓ నెల ఆగిన తరువాత..కాస్త అర్జంట్ ఓ కోటి పంపించండి అంటూ అసలు కథ మొదలవుతుంది.

మన వాళ్ల ఆత్రం అలా వుంది. అవతలి హీరోల డబ్బు గాత్రం అలా వుంది మరి.