సినిమాలా? లైఫా? అన్నారు డాక్టర్లు

'ది వారియర్'ను తెలుగు, తమిళ్‌ భాషల్లో ఈవారం రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తెలుగు ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. సినిమా షూట్ స్టార్ట్ కావడానికి కొన్ని రోజుల ముందు రామ్ పోతినేని…

'ది వారియర్'ను తెలుగు, తమిళ్‌ భాషల్లో ఈవారం రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తెలుగు ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. సినిమా షూట్ స్టార్ట్ కావడానికి కొన్ని రోజుల ముందు రామ్ పోతినేని నెక్ ఇంజ్యూరీతో కనిపించారు. 

సోషల్ మీడియాలో పిక్ కూడా పోస్ట్ చేశారు. దాని వెనుక కథను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు. 'ది వారియర్'లో రామ్ ఐపీఎస్ ఆఫీసర్ రోల్ చేశారు. ఖాకి రోల్ అంటే ఫిట్‌గా ఉండాలి. జిమ్‌లో వర్కవుట్స్ స్టార్ట్ చేశారు. 

హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అయ్యిందని, మూడు నెలలు రెస్ట్ తర్వాత డాక్టర్‌ను 'ఇంకెన్నాళ్లు ఇలా?' అని ప్రశ్నిస్తే… 'సినిమాలు ముఖ్యమా? జీవితం ముఖ్యమా?' అని ఎదురు ప్రశ్నించారని రామ్ చెప్పారు. సినిమాయే లైఫ్ అనుకునే వాళ్ళకు అది అవుటాఫ్ సిలబస్ క్వశ్చన్‌లా ఉంటుందని అన్నారు. అభిమానుల కోసం పెయిన్ భరించి మరీ ఫైట్స్, సాంగ్స్ చేసినట్టు రామ్ తెలిపారు. 

హీరోయిన్ కృతి శెట్టి కూడా సాంగ్స్ చేసినప్పుడు రామ్ ఎంతో పెయిన్‌తో చేశారని తెలిపింది. రామ్ ఎనర్జీ మ్యాచ్ చేయడానికి కష్టపడినట్టు ఆమె పేర్కొంది. రామ్ డెడికేషన్, హార్డ్ వర్క్ మీద ఆమె ప్రశంసలు కురిపించింది.  

పోలీస్ నేపథ్యంలో సినిమా చేయాలని ఐదారు కథలు విన్నాక… అన్నీ రొటీన్‌గా అనిపించడంతో ఇక పోలీస్ కథలు వద్దనుకుంటున్న టైమ్‌లో లింగుస్వామి కథ విన్నానని, పోలీస్ కథ చేస్తే ఇటువంటి కథ చేయాలని ఫిక్స్ అయినట్టు రామ్ తెలిపారు. 

రామ్ హీరోగా పది సినిమాలు చేయాలనుకుంటున్నట్లు దర్శకుడు లింగుస్వామి స్టేజి మీద చెప్పారు. తనకు హీరో ఎంతో సపోర్ట్ చేశాడన్నారు. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి 'రన్' చూశాక తనతో సినిమా చేయాలని వచ్చారని, 20 ఏళ్ళ తర్వాత తమ కాంబినేషన్ కుదిరిందని, ఆయనతో మరో 20 ఏళ్ళు సినిమాలు చేయాలనుందని లింగుస్వామి అన్నారు.