ఇన్ ఫా స్ట్రక్చర్ నుంచి మీడియా వరకు మెగా సంస్ధ పిపి రెడ్డి అడుగుపెట్టని రంగం లేదు. ఇప్పడు ఆయన సినిమా రంగంలోకి కూడా దిగుతున్నారు. అయితే నేరుగా కాదు. వెనకాల అంతా ఆయనే వుంటారు. తెరముందు ఆయన సన్నిహిత బంధువు వుంటారు. పిపి రెడ్డి బర్త్ డే సందర్భంగా ఓ బ్యానర్ ను, ఫస్ట్ ప్రొడక్షన్ వివరాలను బయటకు వెల్లడించారు. అయితే స్టార్ కాస్ట్ అదీ ఇంకా ప్రకటించలేదు.
ముందుగా ఓ మిడ్ రేంజ్ సినిమాతో రంగంలోకి దిగుతున్నారు. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై మొదటి చిత్రం గా “ఆనంద్ రవి” దర్శకత్వం లో “కొరమీను” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో చిత్ర నటీనటులను, సాంకేతిక నిపుణులను వెల్లడించనున్నారు.
మెగాసంస్థ స్టామినాకు, మెగా సంస్థ అధినేతకు వున్న పరిచయాలకు ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమాలు అరడజను ఒకేసారి ప్లాన్ చేయగలరు. అయితే ఇండస్ట్రీ తీరుతెన్నులు, వ్యవహారాలు అన్నీఅవగతం కావడం కోసం అన్నట్లు, ముందుగా ఈ పైలట్ ప్రాజెక్టును టేకప్ చేసినట్లు తెలుస్తోంది. మెగా సంస్థ త్వరలో ఓటిటి రంగంలొకి కూడా అడుగుపెట్టబోతోందని వార్తలు వున్నాయి.