పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అరవింద్, మరి కొందరు కలిసి నిర్మించ తలపెట్టిన సినిమా రామాయణం. వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు బోగట్టా.
సాధారణంగా రామాయణం అంటే అందరికీ తెలిసిన కథనే. దాన్ని కొత్తగా చెప్పే ప్రయత్నం చేయగలరు కానీ కొత్త విషయాలు జోడించలేరు. అయితే ప్రెజెంటేషన్ నే కొత్తగా వుండాలనే ప్రయత్నం చేస్తున్నారు.
స్క్రిప్ట్ నే వీలయినంత సినిమాటిక్ గా, క్రిస్ప్ గా వుండేలా చూస్తున్నారని బోగట్టా. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, వీఆర్ వెర్షన్ రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇది అయిన తరవాత కాస్టింగ్ మీదకు వెళ్తారట.
జెర్సీ సినిమా బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు అన్ని భాషల నటులు కీలకపాత్రల్లో వుండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.