
సీనియర్ యాక్టర్, కమెడియన్ సుధాకర్ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. తన అనారోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే....
"అందరికీ నమస్కారం. నా మీద వచ్చిన వార్తలన్నీ ఫేక్. అలాగే తప్పుడు సమాచారం నమ్మకండి, అలాగే ప్రచారం కూడా చేయొద్దు. నేను చాలా హ్యాపీగా వున్నాను అని ఆయన నవ్వుతూ ఉత్సాహంగా చెప్పడం విశేషం. కొంత కాలంగా సినిమా నటుల ఆరోగ్యానికి సంబంధించి ఫేక్ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
ఆ మధ్య శరత్‌బాబు అనారోగ్యంతో ట్రీట్‌మెంట్ తీసుకుంటుంటే... చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అలాంటిదేమీ లేదని ఖండించాల్సి వచ్చింది. ఇటీవలే ఆయన కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. చెన్నైలో అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. సరిగ్గా శరత్ బాబు మన మధ్య నుంచి వెళ్లిపోయిన రోజు కమెడియన్ సుధాకర్‌కు సంబంధించి వార్తలొచ్చాయి.
సుధాకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వెంటిలేటర్‌పై ఉన్నారనే వార్తలు సినీ అభిమానుల్ని ఆవేదనకు గురి చేశాయి. అయితే ఆ వార్తలన్నీ ఫేక్ అని స్వయంగా సుధాకరే చెప్పాల్సి వచ్చింది. ఏడాది క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన సుధాకర్ మృత్యువుతో పోరాటంలో గెలిచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. గతంలో అనారోగ్యానికి గురైన పరిస్థితులే మళ్లీ వచ్చాయంటూ ప్రచారం చేయడం సుధాకర్ అభిమానులు, కుటుంబ సభ్యుల్ని ఆవేదనకు గురి చేశాయి.
దీంతో తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ ఆయన వీడియో తీసి మరీ పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికైనా సినీ నటుల ఆరోగ్య సంబంధిత విషయాలపై తప్పుడు ప్రచారం ఆగాల్సిన అవసరం వుంది. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటం ఎవరికీ మంచిది కాదు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా