వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు వర్మకు పెళ్లి కోరిక‌

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ నిత్యం వార్త‌ల్లో క‌నిపించే వ్యక్తి. ఆయ‌న్ను సోష‌ల్ మీడియా విడిచిపెడితే త‌ప్ప‌…ఆయ‌న మాత్రం ఎప్ప‌టికీ దాన్ని విడిచిపెట్ట‌డు. సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై వ‌ర్మ త‌న‌దైన స్టైల్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూ ఉంటాడు.…

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ నిత్యం వార్త‌ల్లో క‌నిపించే వ్యక్తి. ఆయ‌న్ను సోష‌ల్ మీడియా విడిచిపెడితే త‌ప్ప‌…ఆయ‌న మాత్రం ఎప్ప‌టికీ దాన్ని విడిచిపెట్ట‌డు. సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై వ‌ర్మ త‌న‌దైన స్టైల్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆయ‌న ట్వీట్స్ సంచ‌ల‌నం రేకెత్తిస్తుంటాయి.

ఎందుకో గానీ, ఆయ‌న‌కు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ బాగా నచ్చాడు. నెల క్రితం ట్రంప్ మ‌న‌దేశానికి వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న‌పై వ‌ర్మ స‌ర‌దాగా ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఆయ‌న ట్రంప్‌పై ట్వీట్ చేసి త‌న అభిమానాన్ని చాటుకున్నాడు.

ఈ సారి మాత్రం ట్రంప్‌తో పాటు మోడీని కూడా జ‌త క‌లిపాడు. ట్రంప్‌, మోడీ మ‌ధ్య స్నేహం గురించి ఆయ‌న ట్వీట్ చేశాడు. వాళ్ల‌ద్దరికి సంబంధించి వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘దీన్ని ఎడిట్‌ చేసిన ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది’. అంటూ వ‌ర్మ ట్వీట్ చేశాడు.

ఈ వీడియోకు రజినీకాంత్‌, మమ్ముట్టి కలిసి నటించిన దళపతి సినిమాలోని ‘సింగారాల పైరుల్లోన బంగారాలే పండెనంట’ అనే పాట తమిళ వర్షన్‌ను జత చేర్చారు. ఈ పాటలో రజినీ, మమ్ముట్టి స్థానంలో మోదీ ట్రంప్‌లను చేర్చి వాళ్లు ఒకరికొకరు పోటీ పడుతూ పాట పాడుతున్నట్లు ఎడిట్‌ చేశారు.  

వర్మపై నెటిజ‌న్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. స‌హ‌జంగా ఎదుటి వాళ్ల‌ను హ‌ర్ట్ చేసేలా ట్వీట్స్ చేసే వ‌ర్మ‌లో ఇలాంటి స‌ర‌దా కోణం కోణం కూడా ఉందా అని నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యంతో కూడిన ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. నెటిజ‌న్లు త‌మ సృజ‌నాత్మ‌క‌త‌ను కూడా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ పాట తెలుగులో అయితే ఎలా ఉంటుందో  ఎడిట్‌ చేసి ఆ వీడియోను కామెంట్‌లో పెట్టారు. గతంలో ట్రంప్‌ మోదీ మధ్య స్నేహ బంధానికి సంబంధించిన ఓ వీడియో టిక్‌టాక్‌లో ట్రెండ్‌ అయిన విషయం తెలిసిందే.  

అయితే ఇక్క‌డ ప్ర‌ధానంగా చ‌ర్చ‌నీయాంశం ఏంటంటే…వ‌ర్మకు పెళ్లైన విష‌యం తెలిసిందే. పెళ్లిళ్లు, ఇత‌ర‌త్రా సెంటిమెంట్ల‌కు తాను దూర‌మ‌ని ప‌దేప‌దే చెప్పే వ‌ర్మ‌…ఆ వీడియోను ఎడిట్ చేసిన వారిని పెళ్లి చేసుకోవాల‌ని ఉందంటూ కోరిక వెల్ల‌డించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఎంతైనా వ‌ర్మ క‌దా…ఏం చేసినా ఆయ‌న‌కే చెల్లు. 

కన్నా బీజేపీకి మాత్రం కన్నం వెయ్యకు