ప్ర‌భాస్‌తో ప్రేమ‌, పెళ్లిపై…నిహారిక స్పంద‌న ఏంటంటే?

బాహుబ‌లి ప్ర‌భాస్‌కు ఇప్ప‌టికే చాలా మందితో చాలా ర‌కాలుగా పెళ్లిళ్లు జ‌రిగిపోయాయి. తాజాగా ప్ర‌భాస్‌తో మ‌రో ప్ర‌ముఖ కుటుంబానికి చెందిన హీరోయిన్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు…మెగాస్టార్ చిరు త‌మ్ముడు…

బాహుబ‌లి ప్ర‌భాస్‌కు ఇప్ప‌టికే చాలా మందితో చాలా ర‌కాలుగా పెళ్లిళ్లు జ‌రిగిపోయాయి. తాజాగా ప్ర‌భాస్‌తో మ‌రో ప్ర‌ముఖ కుటుంబానికి చెందిన హీరోయిన్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు…మెగాస్టార్ చిరు త‌మ్ముడు నాగ‌బాబు కుమార్తె నిహారిక కావ‌డం విశేషం.

నిహారిక త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టారు. మెగా వార‌సురాలిగా కాకుండా…నిహారిక‌గానే సొంత వ్య‌క్తిత్వాన్ని చాటుకునేందుకు ఆమె శ్ర‌మిస్తున్నారు. గ్లామ‌ర్ పాత్ర‌ల‌ను పోషించ‌డానికి కూడా రెడీ అయిన‌ట్టు ఆమె తాజాగా త‌న అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్న విష‌యం తెలిసిందే.

క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ విధించిన నేప‌థ్యంలో షూటింగ్‌లు ఆగిపోయిన విష‌యం తెలిసిందే. దీంతో సినీ సెల‌బ్రిటీలు త‌మ అభిమానుల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా చిట్‌చాట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో  తాజాగా ఆన్‌లైన్ ద్వారా అభిమానులతో మాట్లాడిన నిహారిక వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

`మీరు ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటున్నారా అక్కా..` అని ఓ అభిమాని నిహారిక‌ను ప్ర‌శ్నించాడు. దీనికి నిహారిక చాలా తెలివిగా, హూందాగా స‌మాధాన‌మిచ్చారు.  `మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి. ఆ వార్తలన్నీ అవాస్తవాలు. నేను ప్రభాస్‌ను లవ్ చేయడం, పెళ్లి చేసుకోవడం నిజం కాదు` అని నిహారిక తేల్చి చెప్పారు.  

అయితే ప్ర‌భాస్‌తో పెళ్లి వార్త‌ల‌పై ఆ అభిమాని అడిగిన‌ట్టు ఎక్క‌డ ప్ర‌చార‌మైందో తెలియ‌డం లేదు. కానీ త‌న అభిప్రాయాన్ని జ‌న‌ర‌లైజ్ చేసి అడిగాడ‌నిపించింది. అయితే నిహారిక ఎక్క‌డా ఆవేశానికి గురి కాకుండా సున్నితంగా తోసిపుచ్చుతూనే, అభిమానిని నిరాశ‌ప‌ర‌చ‌కుండా స‌మాధాన‌మిచ్చారు. ఇది ఆమెలోని ప‌రిణ‌తిని ప్ర‌తిబింబించింద‌ని చెప్పొచ్చు. 

అందుకే చిరంజీవి మెగాస్టార్ అయింది