కూల్..బన్నీ వాస్..కూల్

సాధారణంగా ఔట్ ఆఫ్ ఫోకస్ లో వుంటారు నిర్మాత బన్నీవాస్. పబ్లిసిటీకి, పబ్లిక్ ఫంక్షన్ లకు దూరంగా వుంటారు. స్టేజ్ మీదకు రావడానికి పెద్దగా ఇష్టపడరు అలాంటిది తొలిసారి తొలిసారి కాస్త బరస్ట్ అయ్యారు.…

సాధారణంగా ఔట్ ఆఫ్ ఫోకస్ లో వుంటారు నిర్మాత బన్నీవాస్. పబ్లిసిటీకి, పబ్లిక్ ఫంక్షన్ లకు దూరంగా వుంటారు. స్టేజ్ మీదకు రావడానికి పెద్దగా ఇష్టపడరు అలాంటిది తొలిసారి తొలిసారి కాస్త బరస్ట్ అయ్యారు. అది కూడా పెద్దగా అవసరం వున్న రీజన్ కు కాదు. 

ఆయన గురించి బాగా తెలిసిన వారికి, ఆయన స్వభావం పరిచయం వున్నవారికి ఇదంతా చూస్తుంటే.. ఆయన ను ఎవరో ఎందుకో రాంగ్ రూట్ లోకి తీసుకెళ్లినట్లు కనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే బన్నీ వాస్ నిర్మించిన డిఫరెంట్ మూవీ 'చావు కబురు చల్లగా ' ఈవారం విడుదల కాబోతోంది. దానికి ఇప్పటికే మంచి బజ్ వుంది. 

విడుదలకు పెద్దగా కాంపిటీషన్ కూడా లేదు. మంచి ఓపెనింగ్స్ వస్తాయనే నిర్మాతలు ఆశగా వున్నారు. ఇలాంటి టైమ్ లో ఎక్కడో ఓ మూల ఓ వార్త, విడుదలయిన రెండు వారాలకే ఈ సినిమా ఆహా ఓటిటిలోకి వస్తుందని. నిజానికి ఈ వార్త ఎక్కడ వచ్చిందో కూడా పెద్దగా జనాలకు పట్టలేదు.

కానీ ఈ వార్త బన్నీవాస్ కు కోపం తెప్పిచింది. ఈ వార్త కావాలని ఎవరో నిర్మాత, ఆయన పీఆర్వోలు స్ప్రెడ్ చేస్తున్నారంటూ ఓపెన్ గా ఫైర్ అయ్యారు. అంతా తనకు తెలుసు అని, ఇది మంచి పద్దతి కాదు అని హెచ్చరించారు. 

నిజానికి ఇదంత సీరియస్ గా తీసుకోవాల్సిన వ్యవహారం కాదు. ఈరోజుల్లో ఏ సినిమా ఎన్నాళ్లకు ఓటిటిల్లో వస్తుందో ముందే తెలిసిపోతోంది. ఓటిటిలో వస్తుందన్నమాత్రాన జనాలు థియేటర్ రావడం మానేయరు. ఈ విషయం కూడా బన్నీ వాస్ కు తెలిసిందే. అన్నీ తెలిసిన బన్నీ వాస్ ఇలా ఫైర్ అయ్యారు అంటే ఎక్కడ ఏదో జరిగింది. 

ఎవరో బన్నీవాస్ ను ఎందుకో సైడ్ ట్రాక్ పట్టించారు. ఇలా చేస్తే మరింత అటెన్షన్ గ్రాబ్ చేయవచ్చని చెప్పారా? లేదా చిన్న వివాదం చేస్తే మరింత అట్రాక్షన్ వస్తుందని నూరి పోసారా? ఎక్కడో ఏదో జరిగింది. బన్నీవాస్..కూల్..కూల్..అనవసరంగా మీకున్న మంచి  పేరు పాడుచేసుకోకండి ఎవరి మాటలో నమ్మి?

అయన తప్ప..అంతా మోసగాలే

ఇదంతా జ‌గ‌న్ శ్ర‌మ ఫ‌లితమే..