లియో సమక్షంలో రింగులు మార్చుకున్న జంట

తమకు ఇష్టమైన హీరో ఫొటోను పెళ్లి కార్డుల్లో ముద్రించుకున్న జంటల్ని చూశాం. మరికొంతమంది పెళ్లి మంటపం వద్ద తమ హీరో ఫ్లెక్సీలు ఏర్పాటుచేసుకోవడం చూశాం. ఇంకొంతమంది తమ హీరో బ్యానర్ ను పెట్టి, పెళ్లి…

తమకు ఇష్టమైన హీరో ఫొటోను పెళ్లి కార్డుల్లో ముద్రించుకున్న జంటల్ని చూశాం. మరికొంతమంది పెళ్లి మంటపం వద్ద తమ హీరో ఫ్లెక్సీలు ఏర్పాటుచేసుకోవడం చూశాం. ఇంకొంతమంది తమ హీరో బ్యానర్ ను పెట్టి, పెళ్లి చేసుకున్న ఉదంతాలు కూడా చూశాం. ఇది కూడా అలాంటిదే.

అబ్బాయి విజయ్ ఫ్యాన్. అమ్మాయి కూడా విజయ్ కు వీరాభిమాని. సో.. ఇద్దరూ విజయ్ సమక్షంలో ఎంగేజ్ మెంట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ స్టార్ హీరో అందరికీ అందుబాటులోకి రాడు కదా. అందుకే వీళ్లు కాస్త వినూత్నంగా ఆలోచించారు.

ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లియో సినిమా రిలీజైంది. ఈ సినిమా థియేటర్ లో ఈ జంట ఉంగరాలు మార్చుకుంది. అలా విజయ్ సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నట్టు ఫీల్ అయ్యారు వీళ్లు.

తమిళనాడుకు చెందిన వెంకటేష్, మంజుల కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ విజయ్ అభిమానులే. అందుకే లియో వేదికగా నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సినిమా పూర్తయిన వెంటనే, ప్రేక్షకుల సమక్షంలో దండలు మార్చుకున్నారు, ఆ తర్వాత ఉంగరాలు కూడా మార్చుకున్నారు.

ఇది చూసిన విజయ్ ఫ్యాన్స్ ఎంతో సంబరపడ్డారు. కాబోయే వధూవరులతో సెల్ఫీలు దిగారు. విజయ్ పై వాళ్లకున్న అభిమానానికి ఫిదా అయ్యారు చాలామంది. అన్నట్టు శుక్రవారమే వీళ్ల పెళ్లి.