ఆంధ్ర ఏరియాను 100 కోట్ల రేంజ్ లో మార్కెట్ చేసారు ఆర్ఆర్ఆర్ సినిమాను. ఇప్పుడు ఆంధ్రలో రేట్లు లేవు. అందువల్ల కనీసం 20 శాతం రేట్లు తగ్గించాలన్నా దాదాపు 20 కోట్లు ఆదాయం పడిపోతుంది. పైగా సీడెడ్ కూడా అదే పరిస్థితి.
ఇలాంటి నేపథ్యంలో కొత్త రేట్లు కాదు సరికదా, పాత రేట్లు ఇచ్చినా ఆర్ఆర్ఆర్ కు సరిపోవు. తొలివారం అయిదువందల యూనిఫారమ్ రేటు పెడితే తప్ప గిట్టుబాటు కాదు. గతంలో బాహుబలి వన్ అండ్ టూ కి ఇలాగే అయిదు వందల నుంచి వెయ్యి రూపాయలు అమ్మడం ద్వారా కోట్లకు కోట్లు జనం నుంచి లాగేయగలిగారు.
ఇప్పుడు అందుకోసమే కోర్టుకు వెళ్లాలని ఆర్ఆర్ఆర్ కు కర్త, కర్మ, క్రియ అయిన రాజమౌళి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తన ప్రొడక్ట్ కు అయిన ఖర్చు, ఆంధ్రలో వున్న రేట్లు వివరిస్తూ, తన ప్రొడెక్ట్ ను అండర్ సేల్ చేయమనే హక్కు ఎవరికీ లేదనే వాదనను కోర్టు ముందు వుంచుతారని తెలుస్తోంది.
కోర్టులో ఈ వాదన నిల్చునే అవకాశాలు ఎక్కువగానే వున్నాయి. అయితే ఒక వేళ ఆర్ఆర్ఆర్ ఆ విధంగా రేట్లు తెచ్చుకుంటే భీమ్లా నాయక్ కూడా ఫాలో ఫాలో అనడం గ్యారంటీ. ప్రభుత్వంతో బంధాలు వున్న రాధేశ్యామ్ నిర్మాతలు ఏం చేస్తారో మరి?