కవర్ సాంగ్ కోసం పాతికలక్షలు

భారీ సినిమా అంటే అలాగే వుంటుంది. సినిమాకు బజ్ తేవాలి. పైకి లేపాలి అంటే బియాండ్ సినిమా ఏదో ఒకటి చేయాలి. అలాంటి వాటిల్లో ఒకటి కవర్ సాంగ్స్.  Advertisement ఒరిజినల్ పాటకు ప్రత్యేకంగా…

భారీ సినిమా అంటే అలాగే వుంటుంది. సినిమాకు బజ్ తేవాలి. పైకి లేపాలి అంటే బియాండ్ సినిమా ఏదో ఒకటి చేయాలి. అలాంటి వాటిల్లో ఒకటి కవర్ సాంగ్స్. 

ఒరిజినల్ పాటకు ప్రత్యేకంగా వీడియో చేయడం. సాధారణంగా ఇది ఫ్యాన్స్, పాటల అభిమానులు తమ తమ టాలెంట్ చూపించడం కోసం చేస్తుంటారు. 

అయితే సంగీత దర్శకులు థమన్, అనిరుధ్, దేవీశ్రీప్రసాద్ లాంటి వాళ్లు కూడా ప్రత్యేకంగా చేయడం అన్నది కామన్. 

అల వైకుంఠపురములో సినిమాకు థమన్ చేసిన వీడియోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లేటెస్ట్ గా అదే స్కీమును అంతకు మించి భీమ్లా నాయక్ సినిమాకు చేయబోతున్నాడు థమన్.

భీమ్లానాయక్ సినిమాకు కూడా ఇలాంటి చమక్కులు అద్దుతున్నాడు థమన్. ఓ కవర్ సాంగ్ ను అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నాడు. 

ఇందుకోసం దాదాపు ముఫై మందికి పైగా బృందం పని చేస్తోంది. పాతికలక్షలకు పైగా ఖర్చు అవుతుందని తెలుస్తోంది.