క్రాక్ డేరింగ్ డెసిషన్

హీరో రవితేజతో టాగోర్ మధు నిర్మించిన సినిమా 'క్రాక్'. ఈ సినిమాను జనవరి 9న విడుదల చేయాలనే ఆలోచనతో వున్నారు.  Advertisement భోగి-సంక్రాంతి టైమ్ లో విడుదల చేయాలనుకున్నారు కానీ, వరుసపెట్టి మూడు సినిమాలు…

హీరో రవితేజతో టాగోర్ మధు నిర్మించిన సినిమా 'క్రాక్'. ఈ సినిమాను జనవరి 9న విడుదల చేయాలనే ఆలోచనతో వున్నారు. 

భోగి-సంక్రాంతి టైమ్ లో విడుదల చేయాలనుకున్నారు కానీ, వరుసపెట్టి మూడు సినిమాలు డేట్ లు ప్రకటించడంతో, బాగా ముందుకు వచ్చి 9న విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నారు.

నిజానికి సినిమా సిజి వర్క్ ఫైనల్ అవుట్ పుట్ నాలుగో తేదీకి కానీ రాదు. కానీ ఏదో విధంగా ఒక్క రోజయినా ముందుగా రప్పించి, 9న విడుదల చేయాలన్నది ప్లాన్. అలా చేస్తే, దాదాపు 1000 థియేటర్లు సోలోగా మూడు రోజుల పాటు దొరుకుతాయి. 

యాభై శాతం ఆక్యుపెన్సీ మీద అలా అయితే కిట్టుబాటు అవుతుందన్నది ప్లాన్.  కానీ ఇండస్ట్రీ జనాలు మాత్రం ఇది సరైన నిర్ణయం కాదు అంటున్నారు. 

భోగి నుంచి మాత్రమే సినిమాలకు జనం వస్తారని, అంత ముందుగా రావడం వల్ల లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం వుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 

కానీ మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ ఇలా వరుస సినిమాల నడుమ క్రాక్ ను కూడా వదిలి, థియేటర్లు సరిపడా దొరక్క, పైగా యాభై శాతం ఆక్యుపెన్సీ అంటే కలెక్షన్లు ఎవరికీ సరిపోవని, అందువల్ల ముందుగా రావడమే సబబు అని క్రాక్ యూనిట్ భావన.

అయితే ఇది ఇంకా ఫిక్స్ కాలేదు. అందుకే ఫస్ట్ న వదలబోయే ట్రయిలర్ లో కూడా డేట్ ప్రకటించడం లేదని తెలుస్తోంది.

ఇంతవరకూ ఒకా ఛాన్స్ కూడా రాలేదు

మిగతా సీఎం లు ఒక లెక్క, జగన్ ఒక లెక్క